Rohit Sharma: ప్రపంచకప్ ముందు.. హిట్‌మ్యాన్ ప్రకంపనలు..!
ప్రపంచకప్ టోర్నికి ముందు హిట్ మ్యాన్ ప్రకంపనలు మొదలయ్యాయి. టోర్నికి ముందు ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు అర్ధ శతకాలు నమోదు చేసి ఊపుమీదున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన ఉపఖండం పిచ్‌లపై హిట్‌మ్యాన్ ఇదే ఫామ్ కొనసాగిస్తే.. 2019 నాటి ఇన్నింగ్సులు పునరావృతం ఖాయమని కికెట్ పండితులు నమ్ముతున్నారు.
భారత క్రికెట్ హిట్‌మ్యాన్ ప్రపంచ కప్ కోసం బ్యాటింగ్‌కు పదునుపెడుతున్నాడు. ఆసీస్‌తో చివరి వన్డేలో ఓడినా.. రోహిత్ ఇన్నింగ్స్ సిక్సర్లతో అభిమానులకు కనువిందు చేసింది. ప్రపంచకప్ ముంగిట రోహిత్ ఫామ్‌ను అందిపుచ్చుకోవడంతో ఈ సారి మైదానంలో సిక్సర్ల మోత ఖాయమని ఫిక్సయిపోయారు అభిమానులు. ఈ సారి కెప్టెన్‌గా అదనపు బాధ్యతలు కూడా మోస్తున్నాడు. ఇప్పటివరకు మొత్తం 34 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన శర్మ 24 విజయాలు.. 9 పరాజయాలతో మెరుగైన గణాంకాలు నమోదు చేశాడు.
ప్రపంచకప్ అంటే కసి.. ఎందుకంటే..
అసలు ప్రపంచకప్ టోర్నీ అంటేనే రోహిత్ శివాలెత్తిపోతాడు. కింగ్ కోహ్లీ కంటే ముందే రోహిత్ శర్మ ప్రపంచకప్‌లో ఆడాడు. కాకపోతే అది టీ20ల్లో. 2007 ప్రపంచకప్‌లో బ్యాటింగ్ దిగిన తొలి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికాపై 50 పరుగులు చేశాడు. ఆ టోర్నీలో రోహిత్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సార్లే బ్యాటింగ్‌కు దిగాడు. వరుసగా 50*, 8*, 30* స్కోర్లతో నాటౌట్‌గా నిలిచాడు. నాడు ప్రపంచకప్‌ను భారత్ గెలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రైనా వంటి సూపర్ స్టార్లతో పోటీపడి రోహిత్ మిడిలార్డర్‌లో స్థానం పదిలం చేసుకొన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో లారా, కార్ల్ హూపర్, సచిన్ తెందూల్కర్ వంటి దిగ్గజ బ్యాటర్లు... మిగిలిన వారితో పోలిస్తే వేగంగా బంతిని అంచనా వేసి చురుగ్గా కదులుతారు. ఈ లక్షణం రోహిత్‌లోనూ కనిపిస్తుంది. అలా పసిగట్టి అలవోకగా బంతిని బౌండరీ లైను దాటించేస్తాడు.
Rohit Sharma: సిక్సర్లందు రోహిత్ సిక్సర్లు వేరయా!
అదే ఏడాది (2007లో) ఐర్లాండ్‌పై వన్డేల్లోకి అడుగుపెట్టిన రోహిత్ మిడిల్ ఆర్డర్‌లో ఆడుతూ వచ్చాడు. దీంతో 2011 వరకు కేవలం రెండు శతకాలు మాత్రమే చేశాడు. తొలి 1000 పరుగులు సాధించడానికి 43 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది. వేగంగా 1000 పరుగులు చేసిన తొలి 150 మందిలో రోహిత్ పేరు కనిపించలేదు. ఇక 2000 పరుగులు చేయడానికి 82 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. వేగంగా ఈ మైలురాయిని దాటిన తొలి 100 మందిలో కూడా అతడు లేడు. ముంబయికి చెందిన ఈ కుర్రాడు అప్పటికి హిట్‌మ్యాన్‌గా రూపాంతరం చెందలేదు. 2011 ప్రపంచకప్‌నకు ముందు దక్షిణాఫ్రికా టూర్‌లో 11, 9, 23, 1, 5 పరుగులు చేశాడు. ఫలితంగా ప్రపంచకప్ స్క్వాడ్‌లో స్థానం కోల్పోయాడు. ఆ ఏడాది భారత్ ప్రపంచకప్ విజేతగా ఆవిర్భవించింది. జీవితకాల అవకాశం చేజారినట్లు రోహిత్ భావించాడు. అది అతడిలో కసిని పెంచింది. ‘నా టైమ్’ వస్తుందని ఎదురు చూశాడు..!
హిట్‌మ్యాన్‌గా రూపాంతరం..!
ప్రపంచకప్ అనంతరం వెస్టిండీస్ సిరీస్ కోసం రోహిత్‌కు మరోసారి వన్డే జట్టులోకి పిలుపు వచ్చింది. మిడిలార్డర్‌లో వచ్చినా.. విండీస్ సీమ్ పిచ్‌లపై రోహిత్ చెలరేగిపోయాడు. 68*,7*, 86*, 39, 57 స్కోర్లతో అదరగొట్టాడు. అనంతరం విండీస్ జట్టు భారత్‌కు వచ్చింది. ఆ సిరీస్‌లో కూడా 72, 90*, 95, 27, 21 స్కోర్లతో తానేమిటో జట్టు మేనేజ్‌మెంట్‌కు చూపించాడు. కానీ అతడి కెరీర్‌లో మరో ఏడాది (2012) స్తబ్దుగానే గడిచింది. ఆ ఏడాది కేవలం ఒకే ఒక్క అర్ధశతకం చేశాడు.
2013లో ఇంగ్లాండ్‌పై మొహాలీలో ఫుల్‌టైమ్ ఓపెనర్‌గా కొత్త అవతారం ఎత్తాడు. మరో రెండేళ్లలో వన్డే ప్రపంచకప్ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సంకల్పించుకొన్నాడు. ఛేజింగ్‌లో ఓపెనర్‌గా ఆ మ్యాచ్‌లో 93 బంతుల్లో 83 పరుగులు సాధించాడు. ఆ ఏడాది 27 ఇన్నింగ్స్‌ల్లోనే రెండు శతకాలు, 8 అర్ధ శతకాలతో మొత్తం 1196 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై తొలి ద్విశతకం (209 పరుగులు) కూడా అదే ఏడాది బాదాడు. 2014లో 12 మ్యాచ్‌లు ఆడి 52 సగటుతో 578 పరుగులు సాధించాడు. ఇక 264 పరుగుల ప్రపంచ రికార్డు కూడా అప్పుడే సాధించాడు. దీనిలో 33 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. సాధారణంగా ఓ జట్టు మొత్తం కలిసి సాధించేంత స్కోర్‌ను ఒక్కడే చేయడం విశేషం. తొలి ద్విశతకం ఏదో అదృష్టవశాత్తు చేసింది కాదని ప్రపంచానికి చెప్పాడు. ఇక ఓపెనర్‌గా రోహిత్‌కు ఎదురు లేకుండా పోయింది.
- కేవలం 2013 నుంచి 2020 వరకు 135 ఇన్నింగ్స్‌లు ఆడి 7,119 పరుగులు పూర్తి చేశాడంటే అతడి జోరును అర్థం చేసుకోవచ్చు. 27 శతకాలు, 31 అర్ధశతకాలు వీటిల్లో ఉన్నాయి.
- కెరీర్‌లో 181 ఇన్నింగ్స్‌లు పూర్తయ్యే సరికి 7 వేలు, 200 ఇన్నింగ్స్‌లకు 8 వేలు, 217 ఇన్నింగ్స్‌లకు 9 వేలు, 241 ఇన్నింగ్స్‌లకు 10 వేల పరుగుల మైలురాయిని దాటేశాడు. వేగంగా ఆ మైలు రాళ్లను దాటిన టాప్ 5లో ఒకడిగా రోహిత్ కొనసాగాడు. అంతేకాదు.. వన్డేల్లో అఫ్రిది, గేల్ తర్వాత అత్యధిక సిక్సులు (292) బాదింది కూడా హిట్‌మ్యానే.
ప్రపంచకప్‌ల్లో అదరగొట్టే ప్రదర్శన..
- 2015 ప్రపంచకప్‌లో మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన శర్మ ఒక శతకం, రెండు అర్ధ శతకాలతో 330 పరుగులు సాధించాడు. ఇక 2019లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్ పూర్తి స్థాయిలో విశ్వరూపం చూపాడు. మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల్లో ఐదు శతకాలు బాదేశాడు. (122*; సౌతాఫ్రికాపై), (57.. ఆస్ట్రేలియాపై), (140.. పాకిస్థాన్‌పై), (1 అఫ్గానిస్థాన్‌పై), (18.. వెస్టిండీస్‌పై), (102.. ఇంగ్లాండ్‌పై), (104.. బంగ్లాదేశ్‌పై), (103.. శ్రీలంకపై), (1.. న్యూజిలాండ్‌పై) స్కోర్లు సాధించాడు. ఇందులో హ్యాట్రిక్ సెంచరీలు ఉండటం విశేషం.
- ఈ టోర్నీలో 659 బంతులను ఎదుర్కొని 81 సగటుతో 648 పరుగులు చేశాడంటే ఏ రకంగా బౌలర్లను ఊచకోత కోశాడో అర్థం చేసుకోవచ్చు. ఇదీ ఓ రికార్డే. వీటిల్లో 67 ఫోర్లు, 14 సిక్స్‌లున్నాయి. ప్రపంచకప్ టోర్నీలో ఇన్ని పరుగులు చేసిన మరో క్రికెటర్ లేరు.
- సాధారణంగా అతడి వన్డే సగటు 48.85. అయితే, ప్రపంచకప్ టోర్నీల్లో ఆడిన 17 మ్యాచ్‌ల్లో సగటు 65. అదే 2019 ప్రపంచకప్‌లో అయితే ఏకంగా అతడి యావరేజి 81.
- ఈ సారి కెప్టెన్‌గా రోహిత్ బరిలోకి దిగుతున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆసియాకప్ రూపంలో భారత్‌కు పెద్ద టోర్నీలో రోహిత్ నాయకత్వం వహించి విజయాన్ని అందించడం అభిమానులు శుభసూచకంగా భావిస్తున్నారు.
2023 మొదలైన హిట్‌మ్యాన్ జోరు..!
ఈ ఏడాది రోహిత్ మెరుగైన ఆటతీరునే కనబరుస్తున్నాడు. మొత్తం 15 మ్యాచ్‌ల్లో 50 సగటుతో 658 పరుగులు సాధించాడు. వీటిల్లో ఆరు అర్ధశతకాలు.. ఒక శతకం ఉన్నాయి. ఈ ఏడాది ఏ మ్యాచ్‌లోనూ హిట్‌మ్యాన్ స్ట్రైక్ రేట్ 100కు తగ్గకపోవడం విశేషం. చివరి ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు అర్ధశతకాలు (74*, 56, 53, 0, 81) నమోదు చేయడం అతడి జోరుకు అద్దం పడుతోంది. స్వదేశంలో మెగా టోర్నీకి ముందే రోహిత్ బ్యాటింగ్ మెరుపులు మొదలు కావడంతో ఫ్యాన్స్ సంతోషానికి పట్టపగ్గాల్లేవు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ravichandran Ashwin: ఆ రోజు కోహ్లి, రోహిత్ ఏడ్చారు
ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్‌శర్మ డ్రెస్సింగ్‌రూమ్‌లో ఏడ్చారని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. -
Team India: బౌలర్లు పుంజుకునేనా!
పొట్టి సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్న భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. శుక్రవారం జరిగే నాలుగో టీ20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. తొలి రెండు టీ20ల్లో భారత్ నెగ్గగా.. మూడో మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా సిరీస్ ఆశలను ఆసీస్ సజీవంగా ఉంచుకుంది. -
రోహిత్ పరిస్థితేంటి!
నిరుడు టీ20 ప్రపంచకప్ తర్వాతి నుంచి టీ20లకు దూరంగా ఉంటోన్న రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా పర్యటనలోనూ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. -
India vs South Africa: దక్షిణాఫ్రికాకు ముగ్గురి సారథ్యంలో..
దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా సిద్ధం. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. టీ20ల్లో సూర్యకుమార్, వన్డేల్లో కేఎల్ రాహుల్ భారత్‌కు నాయకత్వం వహించనున్నారు. -
టీ20 ప్రపంచకప్‌కు ఉగాండా
ఉగాండా..! క్రికెట్‌లో ఈ పేరు అసలు ఎప్పుడూ వినిపించదు. పెద్ద టోర్నీల్లో ఆ జట్టు ఎప్పుడూ ఆడలేదు. కానీ ఇప్పుడా జట్టు మెగా టోర్నీలో అదృష్టం పరీక్షించుకోనుంది. పెద్ద జట్లతో పోటీకి సై అంటోంది. -
భారత్‌కు 8 పతకాలు ఖాయం
ఐబీఏ ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అదిరే ప్రదర్శన చేశారు. ఆర్మేనియాలో జరుగుతున్న ఈ టోర్నీలో సెమీఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా ఎనిమిది మంది పతకాలు ఖాయం చేసుకున్నారు. -
క్వార్టర్స్‌లో ప్రియాన్షు
సయ్యద్ మోదీ అంతర్జా తీయ బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రియాన్షు రజావత్ క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రియాన్షు 21-18, 11-6 (రిటైర్డ్)తో సతీశ్ కుమార్‌పై విజయం సాధించాడు. -
నజ్ముల్ అజేయ శతకం
కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (104 బ్యాటింగ్; 193 బంతుల్లో 10×4) అజేయ శతకంతో సత్తాచాటడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పుంజుకుంది. -
స్టోక్స్ మోకాలికి శస్త్ర చికిత్స
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మోకాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో భారత్‌తో ఆరంభమయ్యే టెస్టు సిరీస్‌కు సిద్ధం కావాలనే పట్టుదలతో ఉన్న ఈ 32 ఏళ్ల ఆల్‌రౌండర్.. తాజాగా వన్డే ప్రపంచకప్‌లో బ్యాటర్‌గా మాత్రమే ఆడాడు. -
తెలంగాణకు రజతం
సీనియర్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు రజత పతకం సాధించింది. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచింది.


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
-
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
-
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు
-
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు