ZIM vs IND: శిఖర్.. నీ షర్టు ఇవ్వు.. ఫ్యాన్‌కు సరదా రిప్లై ఇచ్చిన భారత ఓపెనర్‌

శిఖర్ ధావన్‌.. మైదానం లోపల, వెలుపల సరదాగా ఉండే టీమ్‌ఇండియా ఆటగాడు. క్యాచ్ పడితే చాలు మీసం మెలేసి తొడ కొట్టేస్తాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలోనూ...

Published : 23 Aug 2022 13:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శిఖర్ ధావన్‌.. మైదానం లోపల, వెలుపల సరదాగా ఉండే టీమ్‌ఇండియా ఆటగాడు. క్యాచ్ పడితే చాలు మీసం మెలేసి తొడ కొట్టేస్తాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలోనూ ఓ తమాషా సన్నివేశం చోటు చేసుకుంది. శిఖర్ ధావన్‌ బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు తన జెర్సీకి స్టిక్కర్‌ వేసుకుని దిగాడు. ఆ తర్వాత కాసేపు ధాటిగా ఆడి 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. అయితే ఓ అభిమాని ‘శిఖర్ నీ చొక్కా ఇవ్వు’ అని ప్లకార్డును పట్టుకుని కనిపించాడు. దానికి సరదాగా స్పందిస్తూ.. చొక్కాను విప్పుతూ కనిపించాడు. ఇదే సీన్‌ కెమెరాల్లో కనిపించడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

జింబాబ్వేపై మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వే గట్టిగా పోరాడినా విజయం మాత్రం సాధించలేకపోయింది. 290 పరుగుల లక్ష్య ఛేదనలో 276 పరుగులు చేయగలిగింది. సికిందర్‌ రజా (115) శతకంతో అదరగొట్టాడు. తన జట్టును గెలిపించినంత పని చేశాడు. బంగ్లాదేశ్‌పై రజా సెంచరీలు కొట్టి మరీ గెలిపించాడు. ఈసారి మాత్రం భారత్‌కు చెమటలు పట్టించినా విజయం మాత్రం చేకూరలేదు. అంతకుముందు భారత యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్ (130) కెరీర్‌లో తొలి శతకం నమోదు చేసుకున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని