IND Vs NZ : రెండో టీ20లో ఉమ్రాన్‌ స్థానంలో అతడిని తీసుకోవాలి : మాజీ క్రికెటర్‌

న్యూజిలాండ్‌తో తొలి టీ20(IND Vs NZ)లో ఓటమిపాలైన నేపథ్యంలో రెండో టీ20 తుది జట్టులో మార్పులు చేయాలని మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ సూచించాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ స్థానంలో వేరే ఆటగాడిని తీసుకోవాలని కోరాడు.

Published : 29 Jan 2023 10:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌(IND Vs NZ)ను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమ్‌ఇండియా(Team India).. తొలి టీ20లో చతికిలబడిన విషయం తెలిసిందే. ఇటు బౌలింగ్‌తోపాటు.. అటు బ్యాటింగ్‌లోనూ తేలిపోవడంతో టీ20 సిరీస్‌ను హార్దిక్‌ సేన ఓటమితో మొదలెట్టింది. ఈ నేపథ్యంలో తర్వాతి మ్యాచ్‌కు తుది జట్టులో మార్పులు చేయాలని మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ సూచించాడు.

పొట్టి ఫార్మాట్‌లో పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌(Umran Malik) తీవ్ర నిరాశ పరుస్తున్నాడని.. బౌలింగ్‌లో వేరియేషన్స్‌ చూపించడం లేదని జాఫర్‌ అన్నాడు. ‘అతడు తన బౌలింగ్‌లో వైవిధ్యాన్ని చూపించకపోతే ఈ ఫార్మాట్‌లో ఇబ్బందులకు గురవుతాడు. తొలి మ్యాచ్‌లో కట్టర్లు మంచి ఎంపిక. కానీ అతడు అలా బౌలింగ్‌ చేయలేదు. రాంచి లాంటి పిచ్‌లపై పేసర్లు వైవిధ్యంతో బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. స్థిరమైన వేగంతో బంతులు విసిరితే నష్టమే’ అని జాఫర్‌ పేర్కొన్నాడు. రెండో టీ20లో ఉమ్రాన్‌ స్థానంలో జితేశ్‌ శర్మను తుదిజట్టులోకి తీసుకోవాలని చెప్పాడు.

‘ఉమ్రాన్‌ స్థానంలో జితేశ్‌ను తీసుకోవాలి. లేదంటే పృథ్వీషాను కూడా ఆలోచించొచ్చు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయాలంటే జితేశే ఉత్తమ ఎంపిక’ అని జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20ని భారత్‌ ఆడనుంది. సిరీస్‌పై ఆశలు నిలవాలంటే.. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ సేన తప్పక గెలవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని