IND vs WI : టీమ్‌ఇండియా ఓపెనింగ్‌.. నా చివరి ఆప్షన్‌ అదే : సునిల్ గావస్కర్

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓపెనింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగం చేయడంపై...

Published : 10 Feb 2022 09:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓపెనింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగం చేయడంపై దిగ్గజ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. కేఎల్‌ రాహుల్‌ గాయం నుంచి కోలుకోవడంతో ఇషాన్‌ కిషన్‌ బదులు జట్టులోకి వచ్చాడు. దీంతో అంతా రోహిత్-రాహుల్ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తారని భావించారు. అయితే, కేఎల్ రాహుల్‌కు బదులు రోహిత్‌తో కలిసి రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌కు దిగాడు. ఇద్దరూ స్వల్ప స్కోర్లు నమోదు చేసి పెవిలియన్‌కు చేరగా.. మిడిలార్డర్‌లో వచ్చిన రాహుల్ (49) ఆకట్టుకున్నాడు. ఇదే విషయంపై సునిల్ గావస్కర్ స్పందించాడు. రోహిత్-పంత్‌ ఓపెనింగ్‌కు రావడం అనేది తన చివరి ఆప్షన్‌గా పేర్కొన్నాడు. 

‘‘టీమ్‌ఇండియా బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఓపెనర్లుగా రోహిత్‌తో కలిసి కేఎల్ రాహుల్‌ను లేదా శిఖర్ ధావన్‌ను ఎంచుకుంటా. శిఖర్ లేనప్పుడు ఎడమ చేతి వాటం బ్యాటర్‌ కావాలంటే ఇషాన్‌ కిషన్‌వైపే మొగ్గు చూపుతా. అలా కాకుండా రోహిత్-పంత్ ఓపెనింగ్‌ జోడీని నా చివరి ఆప్షన్‌గా మాత్రమే తీసుకుంటా’’ అని సునిల్ స్పష్టం చేశారు. ఒకవేళ కొవిడ్ నుంచి రుతురాజ్‌ గైక్వాడ్ కోలుకుని జట్టులో స్థానం సంపాదిస్తే మాత్రం ఓపెనింగ్‌ స్థానానికి చక్కగా సరిపోతాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గత రెండు ఐపీఎల్‌ సీజన్లలో రుతురాజ్‌ చాలా బాగా రాణించాడని గుర్తు చేశాడు. రుతురాజ్‌ ఫామ్‌ ప్రకారం టాప్‌ఆర్డర్‌లో కంట్రిబ్యూట్‌ చేయగలడని సునిల్ గావస్కర్ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని