ఒలింపిక్స్‌లో టీ10 క్రికెట్‌ బెస్ట్‌

ఒలింపిక్స్‌ క్రీడల్లో టీ10 ఫార్మాట్‌ క్రికెట్‌ను చేరిస్తే బాగుంటుందని వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌ అంటున్నాడు. అమెరికాలోనూ ఈ ఫార్మాట్‌కు ప్రోత్సాహం లభిస్తుందని అంచనా వేశాడు. మంచి లాభాలు సైతం వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. అబుదాబి వేదికగా త్వరలో జరిగే టీ10 క్రికెట్ టోర్నీలో...

Updated : 09 Jan 2021 06:18 IST

అబుదాబి: ఒలింపిక్స్‌ క్రీడల్లో టీ10 ఫార్మాట్‌ క్రికెట్‌ను చేరిస్తే బాగుంటుందని వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌ అంటున్నాడు. అమెరికాలోనూ ఈ ఫార్మాట్‌కు ప్రోత్సాహం లభిస్తుందని అంచనా వేశాడు. మంచి లాభాలు సైతం వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. అబుదాబి వేదికగా త్వరలో జరిగే టీ10 క్రికెట్ టోర్నీలో అబుదాబి జట్టుకు క్రిస్‌గేల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జమైకాలోని తన ఇంటి నుంచి అతడు మీడియాతో మాట్లాడాడు.

‘ప్రస్తుతం నాకు అవసరమైనంత విశ్రాంతి లభిస్తోంది. అబుదాబిలో టీ10 లీగును దృష్టిలో పెట్టుకొని త్వరలో సాధన ఆరంభిస్తాను. క్రికెట్‌లో పునరాగమనం చేస్తాను. మా జట్టులో అద్భుతమైన అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. కీరన్‌ పొలార్డ్‌, క్రిస్‌ మోరిస్‌ వంటి ఆటగాళ్లు ఉన్నారు. గతంలో వారితో కలిసి ఆడాను. వారిని మళ్లీ కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని గేల్‌ అన్నాడు.

టీ10 ఫార్మాట్‌ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. ‘ఒలింపిక్స్‌లో టీ10 క్రికెట్‌ను చూడాలనుకుంటున్నా. ఏ రకంగా చూసినా ఇది క్రికెట్‌కు గొప్పదనమే. టీ10కు అమెరికాలోనూ మంచి భవిష్యత్తు ఉంటుంది. అక్కడ క్రికెట్‌కు ఎక్కువ క్రేజ్‌ లేదు. అందుకే ఈ ఫార్మాట్‌ అక్కడికి బాగా నప్పుతుంది. లాభాలు సైతం భారీగానే ఉంటాయి’ అని గేల్‌ అన్నాడు.

ఇవీ చదవండి
200+ డాడీ హండ్రెడ్‌ అయితే 300+ ఏంటి?
జడ్డూ రనౌట్‌కు ఫిదా.. ఫిదా

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని