కోహ్లి దంపతుల ‘సేవ’.. కొత్త ఎన్జీవోకు శ్రీకారం

టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ కలిసి ‘సేవ (ఎస్‌ఈవీవీఏ)’ పేరుతో ఓ ఎన్జీవోను స్థాపించారు.

Updated : 25 Mar 2023 04:29 IST

దిల్లీ: టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ కలిసి ‘సేవ (ఎస్‌ఈవీవీఏ)’ పేరుతో ఓ ఎన్జీవోను స్థాపించారు. అనుష్క శర్మ ఫౌండేషన్‌, విరాట్‌ కోహ్లి ఫౌండేషన్‌ను విలీనం చేసి ఈ కొత్త ఎన్జీవోకు శ్రీకారం చుట్టారు. ‘‘మేము సేవ (ఎస్‌ఈవీవీఏ) ఎన్జీవోకు శ్రీకారం చుట్టాం. ఎస్‌ఈ అంటే సెల్ఫ్‌ (స్వీయ), వీ అంటే విరాట్‌, వీ అంటే వామిక, ఏ అంటే అనుష్క అనేది దీని అర్థం. మాకు సాధ్యమైన మార్గంలో సేవ చేస్తూనే ఉంటాం. ఒక్కటిగా, ఓ కుటుంబంగా.. మేం జీవించే ఈ ప్రపంచం అనే కుటుంబం కోసమే ఇది’’ అని విరాట్‌, అనుష్క సామాజిక మాధ్యమాల్లో తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని