Ajinkya Rahane: రహానె స్కాన్ వద్దన్నాడు
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విలువైన పరుగులు (89) చేసిన అజింక్య రహానె.. బ్యాటింగ్‌లో ఏకాగ్రత కోల్పోకూడదనే ఉద్దేశంతో వేలి గాయానికి స్కానింగ్ తీయడం కూడా వద్దన్నాడంటా! ఈ విషయాన్ని అతని భార్య రాధిక బయటపెట్టింది.
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విలువైన పరుగులు (89) చేసిన అజింక్య రహానె.. బ్యాటింగ్‌లో ఏకాగ్రత కోల్పోకూడదనే ఉద్దేశంతో వేలి గాయానికి స్కానింగ్ తీయడం కూడా వద్దన్నాడంటా! ఈ విషయాన్ని అతని భార్య రాధిక బయటపెట్టింది. రెండో రోజు ఆటలో కమిన్స్ బౌన్సర్.. రహానె కుడి చేతి చూపుడు వేలికి బలంగా తాకింది. నొప్పితో బాధపడ్డ రహానె వెంటనే ఫిజియోను పిలిచి చికిత్స తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కొనసాగించాడు. మూడో రోజూ పోరాటాన్ని సాగించి క్రీజులో నిలబడ్డాడు. రెండో రోజు ఆట తర్వాత గాయానికి స్కానింగ్ తీద్దామంటే రహానె వద్దన్నాడని రాధిక ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో వెల్లడించింది. ‘‘నీ వేలు వాచినప్పటికీ స్కాన్‌కు ఒప్పుకోలేదు. నీ మానసిక దృక్పథాన్ని కాపాడుకోవడం కోసం, బ్యాటింగ్‌పై ధ్యాస మళ్లకుండా ఉండడం కోసం నువ్వు ఇలా చేశావు. నిస్వార్థం, సంకల్పాన్ని ప్రదర్శించావు. తిరుగులేని నిబద్ధతతో క్రీజులో నిలిచి మాకు స్ఫూర్తినిచ్చావు. నీ అచంచలమైన జట్టు స్ఫూర్తికి గర్వపడుతూనే ఉంటా’’ అని ఆమె పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ODI WC 2023: బంగ్లాదేశ్ టెక్నికల్ కన్సల్టెంట్‌గా శ్రీధరన్ శ్రీరామ్.. వరల్డ్ కప్ నుంచి నోకియా ఔట్!
-
Padma Hilsa : బెంగాలీలకు శుభవార్త.. మళ్లీ దేశానికి ‘పద్మా పులస’
-
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై లోక్‌సభలో గళమెత్తిన రామ్మోహన్ నాయుడు
-
Congress: దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ.. పరిశీలనలో 300 పేర్లు!
-
Trisha Krishnan: చర్చనీయాంశంగా త్రిష పోస్ట్.. పెళ్లి వార్తల గురించేనా..?
-
Household debt: కుటుంబాల పొదుపులు సగానికి తగ్గాయ్.. అప్పులు రెండింతలు పెరిగాయ్!