Ruturaj Gaikwad: రుతురాజ్‌కు పగ్గాలు

ఆసియా క్రీడల్లో పోటీ పడే భారత క్రికెట్‌ జట్టుకు యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యం వహించనున్నాడు. సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు జరిగే ఈవెంట్‌ కోసం 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించింది.

Updated : 15 Jul 2023 07:06 IST

ఆసియా క్రీడలకు భారత క్రికెట్‌ జట్టు

రుతురాజ్‌

దిల్లీ: ఆసియా క్రీడల్లో పోటీ పడే భారత క్రికెట్‌ జట్టుకు యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యం వహించనున్నాడు. సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు జరిగే ఈవెంట్‌ కోసం 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్‌ స్టార్‌ రింకు సింగ్‌ తొలిసారిగా భారత జట్టులో చోటు సంపాదించాడు. మరోవైపు ఈ క్రీడల్లో బరిలోకి దిగే మహిళల జట్టులో తెలుగమ్మాయిలు అంజలి శర్వాణి, బారెడ్డి అనూష చోటు దక్కించుకున్నారు. హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.
పురుషుల జట్టు: రుతురాజ్‌ గైక్వాడ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, రాహుల్‌ త్రిపాఠి, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, జితేశ్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, షాబాజ్‌ అహ్మద్‌, రవి బిష్ణోయ్‌, అవేష్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ముకేశ్‌ కుమార్‌, శివమ్‌ మావి, శివమ్‌ దూబె, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌.
స్టాండ్‌బైలు: యశ్‌ ఠాకూర్‌, సాయికిశోర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, సాయిసుదర్శన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని