Rahul Dravid: వాళ్లెందుకు బౌలింగ్‌ చేయరంటే.. కారణం చెప్పిన ద్రవిడ్

సచిన్‌, సెహ్వాగ్‌, గంగూలీ, యువరాజ్‌.. ఇలా ఒకప్పుడు భారత్‌కు మంచి పార్ట్‌టైమ్‌ బౌలర్లు ఉండేవాళ్లు. బంతితో జట్టుకు ఎంతో ఉపయోగపడేవాళ్లు.

Updated : 22 Sep 2023 08:32 IST

మొహాలి: సచిన్‌, సెహ్వాగ్‌, గంగూలీ, యువరాజ్‌.. ఇలా ఒకప్పుడు భారత్‌కు మంచి పార్ట్‌టైమ్‌ బౌలర్లు ఉండేవాళ్లు. బంతితో జట్టుకు ఎంతో ఉపయోగపడేవాళ్లు. కానీ ప్రస్తుత జట్టులో బ్యాటర్లెవరూ బౌలింగ్‌ చేయట్లేదు. ఫీల్డింగ్‌ నిబంధనల్లో మార్పే ఇందుకు కారణమని అంటున్నాడు టీమ్‌ ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌. బ్యాటర్లు ఎందుకు బౌలింగ్‌ చేయట్లేదన్న ప్రశ్నకు అతడు బదులిస్తూ.. ‘‘ఫీల్డింగ్‌ నిబంధనల్లో మార్పే బ్యాటర్లు బౌలింగ్‌ చేయకపోవడానికి కారణమని అనుకుంటున్నా. వలయం లోపల నలుగురికి బదులు అయిదుగురు ఫీల్డర్లు ఉండాలన్న నిబంధన వచ్చింది. దాంతో ఇన్నింగ్స్‌ మధ్య దశలో బౌలింగ్‌ చేయడం పార్ట్‌టైమర్లకు కష్టంగా మారింది’’ అని చెప్పాడు. ఒక్క భారత జట్టులోనే కాకుండా చాలా జట్లలో పార్ట్‌టైమర్లు బాగా తగ్గిపోయారని ద్రవిడ్‌ తెలిపాడు. మరింత మంది ఆల్‌రౌండర్లను వెతకడమే ఈ సమస్యకు పరిష్కారమని, ఆ దిశగా పని చేస్తున్నామని అతడు అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని