Team India: అన్నింట్లో మనమే నం.1

ఒకే సమయంలో క్రికెట్లోని మూడు ఫార్మాట్లలోనూ నంబర్‌వన్‌ జట్టుగా టీమ్‌ఇండియా అవతరించింది. ఇప్పటికే టెస్టులు, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌..

Updated : 23 Sep 2023 09:38 IST

కే సమయంలో క్రికెట్లోని మూడు ఫార్మాట్లలోనూ నంబర్‌వన్‌ జట్టుగా టీమ్‌ఇండియా అవతరించింది. ఇప్పటికే టెస్టులు, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌.. శుక్రవారం ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో విజయంతో ఈ ఫార్మాట్లోనూ నంబర్‌వన్‌ అయింది. పాకిస్థాన్‌ (115)ను ఒక్క పాయింట్‌ తేడాతో వెనక్కి నెట్టి భారత్‌ (116) అగ్రస్థానం సాధించింది. నిజానికి ఆసియా కప్‌లోనే భారత్‌ వన్డే నంబర్‌వన్‌ కావాల్సింది. కానీ బంగ్లాదేశ్‌తో సూపర్‌-4 మ్యాచ్‌లో ఓటమి పాలవడంతో అగ్రస్థానం త్రుటిలో చేజారింది. ఇప్పుడు ఆసీస్‌ను ఓడించడంతో నంబర్‌వన్‌ భారత్‌ చెంతకు చేరింది. దక్షిణాఫ్రికా (2012) తర్వాత మూడు ఫార్మాట్లలో నంబర్‌వన్‌ అయిన జట్టు భారతే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని