ruturaj gaikwad: అదే రోజు.. అదే బాదుడు

నవంబరు 28.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రుతురాజ్‌ ప్రపంచ రికార్డుతో చెలరేగాడు. విజయ్‌హజారె టోర్నమెంట్లో మహారాష్ట్రకు ఆడుతూ ఉత్తర్‌ప్రదేశ్‌పై 159 బంతుల్లోనే 220 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 16 సిక్స్‌లు, 10 ఫోర్లు ఉన్నాయి.

Updated : 29 Nov 2023 03:20 IST

నవంబరు 28.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రుతురాజ్‌ ప్రపంచ రికార్డుతో చెలరేగాడు. విజయ్‌హజారె టోర్నమెంట్లో మహారాష్ట్రకు ఆడుతూ ఉత్తర్‌ప్రదేశ్‌పై 159 బంతుల్లోనే 220 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 16 సిక్స్‌లు, 10 ఫోర్లు ఉన్నాయి. అంతేకాదు శివసింగ్‌ వేసిన ఓ ఓవర్లో ఏడు సిక్స్‌లు (నోబాల్‌ సిక్స్‌తో సహా) బాది ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సరిగ్గా ఏడాది తర్వాత రుతురాజ్‌ అదే రోజు మళ్లీ చెలరేగాడు. ఈసారి అంతర్జాతీయ క్రికెట్లో అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో శతకబాది.. ఈ ఫార్మాట్లో భారత్‌ తరఫున ఆసీస్‌పై తొలి శతకాన్ని నమోదు చేశాడు. టీ20ల్లో భారత్‌ తరఫున నమోదైన 15వ శతకం ఇది. అంతర్జాతీయ క్రికెట్లో రుతురాజ్‌కు  ఇదే తొలి సెంచరీ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని