Sachin Tendulkar: ఆ ఒక్క పరుగు నన్ను మార్చింది

తన మొదటి మ్యాచ్‌లో డకౌటవడం తనకు తీవ్ర నిరాశ కలిగించిందని దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ తెలిపాడు. కాలనీ జట్టు ప్రధాన బ్యాటర్‌గా బరిలో దిగినా సున్నాకే ఔటైనట్లు సచిన్‌ చెప్పాడు

Updated : 01 Feb 2024 08:18 IST

ముంబయి: తన మొదటి మ్యాచ్‌లో డకౌటవడం తనకు తీవ్ర నిరాశ కలిగించిందని దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ తెలిపాడు. కాలనీ జట్టు ప్రధాన బ్యాటర్‌గా బరిలో దిగినా సున్నాకే ఔటైనట్లు సచిన్‌ చెప్పాడు. ‘‘నా జీవితంలో మొట్టమొదటి మ్యాచ్‌కు సాహిత్య సహవాస్‌ (కాలనీ)లోని స్నేహితులందరినీ పిలిచా. కాలనీ తరఫున ప్రధాన బ్యాటర్‌ కావడంతో మ్యాచ్‌ చూడాలని కోరా. స్నేహితులంతా వచ్చారు. కానీ మొదటి బంతికే డకౌటయ్యా. చాలా నిరాశకు లోనయ్యా. గల్లీ క్రికెట్‌కు తగ్గట్లే కొన్ని సాకులు చెప్పా. బంతి తక్కువ ఎత్తులో వచ్చిందని చెప్పడంతో అందరూ ఒప్పుకున్నారు. తర్వాతి మ్యాచ్‌కు కూడా అందరినీ పిలిచా. మళ్లీ తొలి బంతికే ఔటయ్యా. ఈసారి బంతి కాస్త ఎక్కువ ఎత్తులో వచ్చిందని చెప్పా. తప్పు నాది కాదు పిచ్‌దేనన్నా. మూడో మ్యాచ్‌కు ఎవరినీ పిలవలేదు. 5-6 బంతులాడి ఒక్క పరుగు చేసి రనౌటయ్యా. ఆ ఒక్క పరుగు చేసినందుకు ఎంతో సంతోషించా. ఒక్క పరుగు చేసినందుకు శివాజీ పార్కు నుంచి బాంద్రాకు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు సంతృప్తిగా అనిపించింది. నా ఆలోచన విధానాన్ని మార్చింది ఆ ఒక్క పరుగే’’ అని సచిన్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు