Viral Video: క్యాచ్ పట్టి.. గాల్లోకి విసిరి.. కాలితో తన్ని.. మళ్లీ క్యాచ్ పట్టి!
ఫుట్‌బాల్ ఆడటం వచ్చిన వ్యక్తి.. క్రికెట్ గ్రౌండ్‌లో క్యాచ్ పట్టడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఇదిగో ఇలా ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: కొన్నేళ్లుగా క్రికెట్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త లీగ్‌లు పుట్టుకొస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆటగాళ్ల ఆటతీరు కూడా మారుతోంది. కొంతమంది క్రికెటర్లు వినూత్నమైన షాట్లు ఆడుతూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఫీల్డర్లు పాదరసంలా కదులుతూ కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకుంటున్నారు. బౌండరీ లైన్ వద్ద కూడా జంప్, డైవ్‌లు చేస్తూ అద్భుతమైన క్యాచ్‌లు ఒడిసిపడుతున్నారు.
తాజాగా ఓ మ్యాచ్‌లో ఇలాంటి అద్భుతమైన క్యాచ్‌ను ఓ ఫీల్డర్ అందుకుని శభాష్ అనిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫీల్డర్ ఏం చేశాడంటే.. బౌండరీ లైన్ వద్ద బంతిని అందుకుని బ్యాలెన్స్ కంట్రోల్ కాకపోవడంతో బంతిని గాల్లోకి విసిరేశాడు. అతడు గాల్లోకి ఎగిరే కాలితో బంతిని గ్రౌండ్‌లోకి తన్నాడు. వెంటనే వేరే ఫీల్డర్ వచ్చి క్యాచ్ అందుకున్నాడు. ఈ వీడియో చూసి క్రికెట్ అభిమానులే కాకుండా క్రికెటర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, మైఖేల్ వాన్, న్యూజిలాండ్ ఆటగాడు జిమ్మీ నీషమ్ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మీరు ఫుట్‌బాల్ ఆడటం కూడా తెలిసిన క్రికెటర్‌ని ఆడిస్తే ఇలా జరుగుతుంది!! ’ అని సచిన్ ట్వీట్ చేశాడు. నీషమ్.. కచ్చితంగా ఇది అద్భుతమైన క్యాచ్ అని ట్వీట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India vs Australia: ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్నారు.. కంగారూల ఎదుట భారీ లక్ష్యం
-
Kangana Ranaut: మహేశ్ బాబు సినిమాలో నటించలేదన్న బాధ ఉంది: కంగనా రనౌత్
-
Chandrababu Arrest: అక్టోబరు 5వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
-
Ukraine : యుద్ధం ముగిసిన వెంటనే అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు పెట్టుబడులు : జెలెన్ స్కీ
-
Chandrababu Arrest: మహిళా శక్తి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. విశాఖలో ఉద్రిక్తత
-
Apple Devices: యాపిల్ యూజర్లకు కేంద్రం భద్రతాపరమైన అలర్ట్