harmanpreet kaur: ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌!

ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ కౌర్‌కు అరుదైన ఘనత దక్కింది.

Published : 11 Oct 2022 01:16 IST

దిల్లీ: ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన భారత మహిళల జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ కౌర్‌కు అరుదైన ఘనత దక్కింది. ఐసీసీ ప్రకటించిన 2022 సెప్టెంబర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌’అవార్డును కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో పాకిస్థాన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. 

వైస్‌  కెప్టెన్‌ స్మృతి మంధాన, బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నిగర్‌ సుల్తానాను పక్కకు నెట్టి.. ఈ అవార్డును అందుకున్న మొట్టమొదటి భారత మహిళా ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్‌ చరిత్ర సృష్టించింది. ‘‘స్మృతి, నిగర్‌లతో పాటు నామినేట్‌ కావడమే కాకుండా  ఈ అవార్డు గెలుచుకోవడం గర్వంగా ఉంది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం, ఇంగ్లాండ్‌పై చారిత్రక వన్డేలో విజయం సాధించడం నా కెరీర్‌లో ఓ మైలురాయిగా మిగిలిపోతుంది’’ అని హర్మన్‌ తెలిపింది. దాదాపు 23 సంవత్సరాల తర్వాత లండన్‌ గడ్డపై టీమ్‌ఇండియా ఈ గెలుపును నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటికే 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌ చివరి వన్డేలో క్లీన్‌ స్వీప్‌ చేసింది. 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన సీనియర్‌ పేసర్‌ ఝులన్‌ గోస్వామికి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని