World Cup 2023: వన్డే ప్రపంచకప్.. భారత్, పాక్‌ మ్యాచ్‌ రీ షెడ్యూల్‌.. ఎప్పుడంటే?

వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్ రీ షెడ్యూల్ అయింది. కొత్త తేదీని ఐసీసీ ప్రకటించింది.

Updated : 09 Aug 2023 18:22 IST

దిల్లీ: ఈ ఏడాది భారత్‌ వేదికగా అక్టోబర్‌, నవంబర్‌లో వన్డే ప్రపంచకప్‌ (ODI world cup 2023) జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ (IND vs PAK) రీ షెడ్యూల్ అయింది. భద్రతా కారణాల రీత్యా అక్టోబరు 15న జరగాల్సిన మ్యాచ్‌ను ఒకరోజు ముందు (అక్టోబర్ 14న) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. అయితే, వేదికలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ముందుగా నిర్ణయించిన విధంగానే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.

మోదీ మొన్న అన్నారు.. క్రికెటర్లు ఎప్పుడో పాటించారు!

అక్టోబరు 15న నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నందున నిఘా సంస్థలు మ్యాచ్‌ తేదీని మార్చాలని బీసీసీఐకి సూచించాయి. దీంతో ఈ మ్యాచ్‌ తేదీని ఒక్క రోజు ముందుకు.. అంటే అక్టోబర్‌ 14కు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌, పాక్‌ మ్యాచ్‌తోపాటు మరో ఎనిమిది మ్యాచ్‌లను కూడా ఐసీసీ రీ షెడ్యూల్ చేసింది.

రీ షెడ్యూల్ అయిన మ్యాచ్‌లు

  • అక్టోబర్ 10న ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్‌
  • అక్టోబర్ 10న పాకిస్థాన్‌ vs శ్రీలంక
  • అక్టోబర్ 12న ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా
  • అక్టోబర్ 13న ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్
  • అక్టోబర్ 14న భారత్ vs  పాకిస్థాన్‌
  • అక్టోబర్ 15న ఇంగ్లాండ్ vs అఫ్గానిస్థాన్‌
  • నవంబర్‌ 11న ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్
  • నవంబర్‌ 11న ఇంగ్లాండ్ vs పాకిస్థాన్‌
  • నవంబర్‌ 12న భారత్ vs నెదర్లాండ్స్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు