India vs England: రోహిత్‌ సెంచరీ మిస్‌.. కట్టుదిట్టంగా ఇంగ్లాండ్‌ బౌలింగ్‌

India vs England: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా  230 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది.

Updated : 29 Oct 2023 18:04 IST

లఖ్‌నవూ: వన్డే ప్రపంచకప్‌ (ICC Cricket World Cup 2023)లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్‌ ఇండియా బ్యాటర్లకు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ చిన్న జర్క్‌ ఇచ్చింది. ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు తడబడ్డారు. లఖ్‌నవూ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. టాప్‌ ఆర్డర్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ 9(13), విరాట్‌ కోహ్లీ 0(9), శ్రేయాస్‌ అయ్యర్‌4(16) విఫలమైన వేళ, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (87; 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) బాధ్యతయుతమైన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ కాస్త దూరంలో ఔటయ్యాడు. అతడికి కె.ఎల్‌. రాహుల్‌ (39; 58 బంతుల్లో 3 ఫోర్లు), సూర్య కుమార్‌యాదవ్‌ (49; 47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచి వేళ భారత జట్టు ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. సూర్యకుమార్‌ యాదవ్‌ త్రుటిలో అర్ధ శతకం చేజార్చుకున్నాడు. రవీంద్ర జడేజా 8(13), మహ్మద్‌ షమీ 1(5), బూమ్రా 16 (25) పరుగులు చేయగా, కుల్‌దీప్‌ యాదవ్‌ 9(12) నాటౌట్‌గా నిలిచాడు.

40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌ను రోహిత్, కేఎల్ రాహుల్ ఆదుకున్నారు. ముఖ్యంగా రోహిత్ బౌండరీలు బాది స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. అతడికి రాహుల్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 91 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ ఔటైన తర్వాత సూర్యకుమార్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించి జట్టు స్కోరు 200 దాటడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 3, క్రిస్ వోక్స్ 2, ఆదిల్ రషీద్  2, మార్క్ వుడ్ ఒక వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని