IND vs AUS: నాగ్‌పుర్‌లో నిలిచింది.. హైదరాబాద్‌లోనే అమీతుమీ

భారత బ్యాటర్లు అదరగొట్టారు. మరీ ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ (46*) కీలక ఇన్నింగ్స్‌తోపాటు దినేశ్ కార్తిక్‌ (10*) అద్భుత ఫినిషింగ్‌ టచ్‌తో ఆసీస్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని...

Updated : 23 Sep 2022 23:39 IST

ఆసీస్‌పై భారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత్

నాగ్‌పుర్‌: భారత్‌ గెలిచింది. సిరీస్‌ రేసులో నిలిచింది.. ఆసీస్‌ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ (46 నాటౌట్‌: 20 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు) కీలక  పాత్ర పోషించాడు. దినేశ్‌ కార్తిక్‌ (10 నాటౌట్: 2 బంతుల్లో సిక్స్‌, ఫోర్) అద్భుత ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో 8 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఆసీస్‌ ఐదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. అనంతరం భారత్‌ కేవలం నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 7.2 ఓవర్లలో 92 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్ జంపా 3, కమిన్స్‌ ఒక వికెట్‌ తీశారు.   దీంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్‌ 1-1తో సమం చేసింది. చివరి టీ20 మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా ఆదివారం జరగనుంది.

వేడ్‌ విజృంభణ.. అక్షర్‌ కట్టుదిట్టం

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్‌లో రాణించిన కామెరూన్ గ్రీన్ (5) ఈసారి మాత్రం త్వరగా పెవిలియన్‌కు చేరాడు. అయితే ఆ జట్టు కెప్టెన్‌ ఆరోన్ ఫించ్‌ (31) మాత్రం దూకుడుగా ఆడాడు. స్వల్ప వ్యవధిలో ఫించ్‌తోపాటు టిమ్‌ డేవిడ్ (2),  మ్యాక్స్‌వెల్‌ (0) ఔటయ్యారు. అయితే ఆసీస్‌ భారీ స్కోరు సాధించడానికి ప్రధాన కారణం మ్యాథ్యూ వేడ్ (43*)... చివరి వరకు క్రీజ్‌లో ఉండి ధాటిగా ఆడి ఆసీస్‌కు అద్భుత స్కోరును అందించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2, బుమ్రా ఒక వికెట్‌ తీశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని