IPL 2021: అతని వికెట్‌ మ్యాచ్‌ని మలుపు తిప్పింది: విరాట్ కోహ్లీ

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. మ్యాక్స్‌వెల్‌ (50 నాటౌట్‌; 30 బంతుల్లో  6×4, 1×6), శ్రీకర్‌ భరత్‌ (44; 35 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో   7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించింది.

Published : 01 Oct 2021 01:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. మ్యాక్స్‌వెల్‌ (50 నాటౌట్‌; 30 బంతుల్లో  6×4, 1×6), శ్రీకర్‌ భరత్‌ (44; 35 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. లూయిస్‌ (58; 37 బంతుల్లో 5×4, 3×6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. రాజస్థాన్‌ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 17.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల కెప్టెన్‌లు మాట్లాడారు.

అతని వికెట్‌ మ్యాచ్‌ని మలుపు తిప్పింది: విరాట్ కోహ్లీ

‘గత రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ విభాగం పుంజుకొంది.  మేము సరైన మార్గంలో పయనిస్తున్నాం అనడానికి ఇది సంకేతం. మేం తిరిగి అధిపత్యం చెలాయిస్తున్నాం. స్కోరు 175 ఉంటే పోటీగా ఉండేది. మా బౌలింగ్‌లో కొన్ని మార్పులు అవసరం. ఓపికతో ఉండటం వల్ల ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ చేస్తున్న తప్పిదాలను గుర్తిస్తాం. ఈ మ్యాచ్‌లో అదే జరిగింది. లూయిస్ వికెట్ మ్యాచ్‌ని మలుపు తిప్పింది. నమ్మకంతో ఉండటం వల్ల వికెట్లు తీయగలిగాం. మధ్య ఓవర్లలో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. బ్యాటింగ్‌లోనూ మంచి ఆరంభం లభించింది’అని విరాట్ అన్నాడు.

మేం సద్వినియోగం చేసుకోలేకపోయాం : సంజు శాంసన్‌ 

‘బ్యాటింగ్‌లో మాకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు బాగా ఆడారు. కానీ, దాన్ని మేం సద్వినియోగం చేసుకోలేకపోయాం. మిడిల్‌ ఆర్డర్‌ ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం అవసరం. ఈ వారం మాకు కష్టంగా ఉంది. మేం పోరాటం చేయాలి. బంతి కాస్త వేగంగా రావడంతో మా బ్యాటర్లు సరైన షాట్లు ఆడలేకపోయారు. బౌలర్ల ప్రదర్శనపై సంతోషంగా ఉన్నా. మేం కోల్పోయింది ఏం లేదు. ఐపీఎల్‌లో ఏదైనా జరగవచ్చు. మేము ఆడే చివరి మ్యాచ్‌ వరకు నమ్మకం ఉంచాలి’ అని శాంసన్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని