Amit Mishra:కరోనా నుంచి కోలుకోవడం కష్టంగా అనిపించింది: అమిత్‌ మిశ్రా

కరోనా నుంచి కోలుకోవడం తనకు అత్యంత కష్టమైన దశగా అనిపించిందని దిల్లీ క్యాపిటల్స్  లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా అన్నాడు. మే మొదటి వారంలో మిశ్రా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లు సందీప్‌

Updated : 08 Sep 2021 19:06 IST

(Photo:Delhi Capitals Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: కరోనా నుంచి కోలుకోవడం తనకు అత్యంత కష్టమైన దశగా అనిపించిందని దిల్లీ క్యాపిటల్స్  లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా అన్నాడు. మే మొదటి వారంలో మిశ్రా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లు సందీప్‌ వారియర్, వరుణ్ చక్రవర్తి కరోనా బారినపడగా..తర్వాత వృద్ధీమాన్‌ సాహా, అమిత్ మిశ్రాకు కొవిడ్-19 సోకింది. దీంతో బీసీసీఐ ఐపీఎల్‌ 2021ని నిరవధికంగా వాయిదా వేసింది.

‘మే మొదటివారంలో ఐపీఎల్ వాయిదాపడిన తర్వాత నేను కరోనా నుంచి కోలుకోవడంపై దృష్టి పెట్టా.  వైద్యుల సలహాలను పాటిస్తూ క్రమంగా ఫిట్‌నెస్‌ని మెరుగుపర్చుకున్నా. కొవిడ్‌-19 నుంచి కోలుకోవడం అత్యంత కష్టమైన దశగా అనిపించింది. కోలుకున్న తర్వాత ఎవరి దగ్గరికి వెళ్లి మాట్లాడలేదు. ఇంట్లోనే కొన్ని జిమ్‌ పరికరాలను ఏర్పాటు చేసుకుని వ్యాయమం చేశా’ అని మిశ్రా అన్నాడు.

ఇక, ఐపీఎల్-14 సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ దుమ్మురేపుతోంది. ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దిల్లీ క్యాపిటల్స్‌ గురించి మిశ్రా మాట్లాడాడు.‘మేం ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాం. అయినా, కొత్తగా ప్రారంభించాల్సి ఉంటుంది. అన్ని జట్లు రాణించడానికి సమాన అవకాశాలున్నాయి. ఐపీఎల్‌ రెండో దశను యూఏఈలో ఆడబోతున్నాం. కాబట్టి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యుహాలను రూపొందించుకోవాలి’ అని అమిత్‌ మిశ్రా అన్నాడు. సెప్టెంబరు 19న యూఏఈ వేదికగా ఐపీఎల్ ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని