Virat Kohli: అందులో కోహ్లీ తప్పేముంది?

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమిపాలవ్వడంతో కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ సామర్థ్యంపై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. అయితే, అవన్నీ సరైన వాదనలు కావని, వాటిని అసలు పట్టించుకోవాల్సిన పనిలేదని...

Published : 04 Jul 2021 01:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమిపాలవ్వడంతో కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ సామర్థ్యంపై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. అయితే, అవన్నీ సరైన వాదనలు కావని, వాటిని అసలు పట్టించుకోవాల్సిన పనిలేదని పాకిస్థాన్‌ వెటరన్‌ బ్యాట్స్‌మన్‌, కీపర్‌ కమ్రన్‌ అక్మల్‌ భావిస్తున్నాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన అతడు భారత జట్టుకు ధోనీ తర్వాత కోహ్లీనే ఉత్తమ సారథి అని కితాబిచ్చాడు. అలాగే 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌, 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో టీమ్‌ఇండియా ఓటమికి కెప్టెన్‌ కారణం కాదన్నాడు.

‘ధోనీ తర్వాత విరాట్‌ అత్యుత్తమ కెప్టెన్‌. అతడి పేరిట 70 అంతర్జాతీయ శతకాలున్నాయి. అతడు 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2019 ప్రపంచకప్‌ ఆడాడు. అయితే, అక్కడ భారత్‌ విఫలమైనా అందులో కోహ్లీ చేసిన తప్పేముంది? అతడి సారథ్యంలోనే టీమ్‌ఇండియా టెస్టుల్లో వరుసగా ఐదేళ్లు టాప్‌లో కొనసాగింది. ఇలాంటి పరిస్థితుల్లో అతడి కెప్టెన్సీని గమనించండి. అతడి ఆటతీరును పరిశీలించండి. అతడి సారథ్యం అత్యద్భుతం. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడో అద్భుతమైన ఆటగాడు. తనని తాను తీర్చిదిద్దుకున్న విధానం అమోఘం’ అని అక్మల్‌ ప్రశంసలతో ముంచెత్తాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని