Virat Kohli : కోహ్లీతో బరిలోకి దిగితే.. స్వేచ్ఛగా ఆడొచ్చు : దేవ్‌దత్‌ పడిక్కల్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్న యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌ కోహ్లీతో బరిలోకి దిగితే..

Published : 09 Feb 2022 01:52 IST

(Photo : Devdutt Padikkal)

ఇంటర్నెట్ డెస్క్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్న యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌ కోహ్లీతో బరిలోకి దిగితే.. బౌలర్లు తనపై పెద్దగా దృష్టి పెట్టరని పేర్కొన్నాడు. తద్వారా తాను స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసేవాడినని చెప్పాడు. ‘నా వరకైతే విరాట్‌ కోహ్లీతో కలిసి బ్యాటింగ్‌ చేయడం చాలా సులభం. ఎందుకంటే బౌలర్ల దృష్టంతా కోహ్లీపైనే  ఉంటుంది. బంతులు ఎక్కడ వేయాలి? అతడిని ఎలా ఔట్ చేయాలనే దాని గురించే ఆలోచిస్తారు. బౌలర్లు వారి ప్రణాళికలన్నింటినీ కోహ్లీపైనే ప్రయోగిస్తారు. నన్నెవరూ పట్టించుకోరు. దాంతో నేను భయం లేకుండా ఆడేవాడిని. కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడితో ఆడటం నా అదృష్టంగా భావిస్తాను’ అని దేవ్‌దత్‌ పడిక్కల్‌ పేర్కొన్నాడు.

గత ఐపీఎల్ సీజన్లో దేవ్‌దత్ పడిక్కల్‌ 14 మ్యాచుల్లో 411 పరుగులు చేశాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుపై శతకం కూడా నమోదు చేశాడు. మరోవైపు కోహ్లీ గత సీజన్‌లో 15 మ్యాచులు ఆడి 405 పరుగులు చేశాడు. వచ్చే సీజన్‌ కోసం బెంగళూరు యాజమాన్యం విరాట్‌ కోహ్లీ, మహమ్మద్‌ సిరాజ్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌లను రిటెయిన్ చేసుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని