Ashwin: ‘అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేట్ కాదు.. రోహిత్ నోరుజారాడు’
ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టులో టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాణించాడు. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన అశ్విన్.. కపిల్‌దేవ్‌ని (434 వికెట్లు) వెనక్కినెట్టి భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు (436)
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టులో టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాణించాడు. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన అశ్విన్.. కపిల్‌దేవ్‌ని (434 వికెట్లు) వెనక్కినెట్టి భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు (436) పడగొట్టిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్‌పై టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడిని ‘ఆల్‌టైమ్ గ్రేట్’గా అభివర్ణించాడు. దీనిని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ తప్పుబట్టాడు. అశ్విన్ గొప్ప బౌలరే.. కానీ ఇంకా ఆల్‌టైమ్ గ్రేట్ జాబితాలోకి చేరలేదని చెప్పుకొచ్చాడు.
‘అశ్విన్ గొప్ప బౌలర్. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అతడు బౌలింగ్‌లో మంచి వైవిధ్యం ఉంది. స్వదేశీ పిచ్‌లపై అతడిని రికార్డుని పరిశీలిస్తే భారత్‌లో అతడే అత్యుత్తమ స్పిన్నర్. రోహిత్ శర్మ చెప్పినట్టుగా అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేట్ కాదు. విదేశీ పిచ్‌లపై అశ్విన్ ప్రభావం చూపలేడు. అతడి కంటే అనిల్ కుంబ్లే, బిషన్ సింగ్ బేడీ మెరుగ్గా రాణించారు. ప్రస్తుతం ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతంగా రాణిస్తు న్నాడు. అశ్విన్ విషయంలో రోహిత్ శర్మ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. నాకు తెలిసి రోహిత్ నోరుజారాడు. ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ఇదో మార్గం’ అని రషీద్ లతీఫ్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్‌పై మీమ్స్.. విరాట్‌పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్‌కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్‌తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్‌పై మీమ్స్.. విరాట్‌పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?