Cricket News: రంజీ ట్రోఫీలో రియాన్‌ పరాగ్ రికార్డు సెంచరీ.. టెస్టులకు దక్షిణాఫ్రికా స్టార్‌ గుడ్‌ బై

రంజీ ట్రోఫీలో అస్సాం కెప్టెన్‌ రియాన్‌ పరాగ్ (Riyan Parag) రికార్డు శతకం సాధించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న దక్షిణాఫ్రికా హిట్టర్‌ హెన్రిచ్‌ కాస్లెన్ (Heinrich Klaasen) సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

Published : 08 Jan 2024 18:30 IST

ఇంటర్నెట్ డెస్క్: రంజీ ట్రోఫీలో అస్సాం కెప్టెన్‌ రియాన్‌ పరాగ్ (Riyan Parag) రికార్డు శతకం సాధించాడు. ఎలైట్ గ్రూప్‌ బిలో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 56 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. మొత్తం 87 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 12 సిక్స్‌ల సాయంతో 155 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది సెకండ్ ఫాస్టెస్ట్‌ సెంచరీ. రిషభ్‌ పంత్ ఝార్ఖండ్‌పై 2016-17 సీజన్‌లో 48 బంతుల్లోనే సెంచరీ చేసి ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.  

ఈ మ్యాచ్‌లో అస్సాంపై ఛత్తీస్‌గఢ్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఛత్తీస్‌గఢ్‌ 327 పరుగులకు ఆలౌట్ కాగా.. అస్సాం 159 రన్స్‌కే కుప్పకూలి ఫాలోఅన్‌ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో రియాన్ పరాగ్ మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో 254 పరుగులు చేసి 87 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు ఏకనాథ్ కెర్కర్ (31), రిషభ్ తివారీ (48) రాణించడంతో ఈ స్వల్ప టార్గెట్‌ని ఛత్తీస్‌గఢ్‌ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 20 ఓవర్లలో ఛేదించింది.


టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా హిట్టర్

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న దక్షిణాఫ్రికా హిట్టర్‌ హెన్రిచ్‌ కాస్లెన్ (Heinrich Klaasen) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 32 ఏళ్లకే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల నుంచి తప్పుకోవడం గురించి ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, తాను తీసుకునే నిర్ణయం సరైందా? కాదా అని ఎంతో మదనపడ్డానని పేర్కొన్నాడు. చివరకు సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయం చాలా కఠినమైనదని, తన ఫేవరెట్ క్రికెట్ ఫార్మాట్‌కు దూరం అవుతున్నందుకు ఎంతో బాధగా ఉందని క్లాసెన్‌ పేర్కొన్నాడు. వన్డేలు, టీ20ల్లో ఆకట్టుకుంటున్న క్లాసెన్‌కు టెస్టుల్లో మంచి రికార్డేమీ లేదు. 2019లో అరంగేట్రం చేసి కెరీర్‌లో నాలుగే టెస్టులు ఆడి 104 పరుగులు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు