Sourav Ganguly: టీమ్‌ఇండియా ఓటములపై దాదా ఏమన్నాడంటే..?

ఆసియాకప్‌ నుంచి టీమ్‌ఇండియా ఓటములు పెరగడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీ పీటీఐ వద్ద స్పందించాడు. భారత ఆటగాళ్లు అప్రమత్తమవ్వాల్సిన

Published : 23 Sep 2022 15:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆసియాకప్‌ నుంచి టీమ్‌ఇండియా ఓటములు పెరగడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీ స్పందించాడు. భారత ఆటగాళ్లు అప్రమత్తమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పరోక్షంగా చెప్పాడు. ముఖ్యంగా పెద్ద టోర్నమెంట్లలో రాణించకపోవడం ఆందోళనకర విషయమని అంగీకరించాడు. విరాట్‌ శతకంపైనా దాదా స్పందించాడు.

‘‘రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా 80శాతం విజయాలు సాధించాడు.  ఇటీవల భారత్‌ ముడు నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అతడు మొత్తం 35-40 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేశాడు. ఆ మొత్తంలో కేవలం ఐదో లేదా ఆరో మ్యాచ్‌లు ఓడిపోయి ఉంటాడు. రోహిత్‌- రాహుల్‌ ద్రవిడ్‌లు టీమ్‌ఇండియా ప్రస్తుత ఆటతీరుపై ఆందోళన చెందుతుంటారని కచ్చితంగా చెప్పగలను. వాళ్లు మెరుగుపర్చుకొంటారు’’ అని గంగూలీ పేర్కొన్నాడు. 

‘‘ఒకట్రెండ్‌ మ్యాచ్‌ల్లో ఓటములకు నేను ఆందోళన చెందను. కానీ, మేము పెద్ద టోర్నమెంట్లలో రాణించడంలేదు. మేం దానిపై చర్చిస్తాం. వరల్డ్‌కప్‌లో ఆడేందుకు జట్టు రెండు మూడు వారాల్లో ఆస్ట్రేలియాకు వెళుతుంది. అక్కడ ప్రాక్టిస్‌ మ్యాచ్‌లు ఆడి పరిస్థితులకు అలవాటుపడుతుంది. ఆసియాకప్‌లో కోహ్లీ శతకం సాధించడం శుభవార్త. ఈ ఊపును కొనసాగిస్తాడని ఆశిస్తున్నాను’’ అని దాదా వెల్లడించాడు. ఆసియా కప్‌ ఫైనల్‌కు చేరడంలో భారత్‌ విఫలమైంది. మరోవైపు ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 208 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఆసీస్‌ బ్యాటర్ల ముందు భారత బౌలర్లు తేలిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని