Ross Taylor : ఆ మ్యాచ్‌లో డకౌట్.. రాజస్థాన్‌ ఫ్రాంచైజీ ఓనర్‌ నా మొహంపై కొట్టాడు: టేలర్‌

కివీస్‌ మాజీ ఆటగాడు రాస్‌ టేలర్‌ సంచలన విషయం బయటపెట్టాడు. భారత టీ20 లీగ్‌లో ఆడినప్పుడు ఓ ఫ్రాంచైజీ యజమాని...

Published : 14 Aug 2022 02:56 IST

అతడు నవ్వుతూనే చేసినా.. సరిగ్గా అనిపించలేదన్న కివీస్‌ మాజీ బ్యాటర్

ఇంటర్నె్ట్ డెస్క్‌: కివీస్‌ మాజీ ఆటగాడు రాస్‌ టేలర్‌ సంచలన విషయం బయటపెట్టాడు. భారత టీ20 లీగ్‌లో ఆడినప్పుడు ఓ ఫ్రాంచైజీ యజమాని తన మొహం మీద ఓ మూడు, నాలుగుసార్లు కొట్టాడని ఆరోపించాడు. ఇదే విషయాన్ని తన జీవిత చరిత్ర ‘‘బ్లాక్‌ అండ్ వైట్’ పుస్తకంలో వెల్లడించాడు. ఈ వారంలోనే ఈ బుక్‌ విడుదలైంది. రాజస్థాన్‌ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని టేలర్‌ అందులో పేర్కొన్నాడు. 

‘‘మొహాలీ వేదికగా పంజాబ్‌తో మ్యాచ్‌లో నేను డకౌట్‌గా పెవిలియన్‌కు చేరా. ఆ మ్యాచ్‌లో మేం 195 పరుగులను ఛేదించాల్సి ఉంది. అయితే మేం దానిని అందుకోలేకపోయాం. మ్యాచ్‌ ముగిశాక జట్టుతోపాటు సహాయక సిబ్బంది, మేనేజ్‌మెంట్ హోటల్‌లో కూర్చొన్నాం. అక్కడ షేన్‌ వార్న్‌, లిజ్‌ హుర్లే తదితరులు ఉన్నారు. అయితే రాజస్థాన్‌ జట్టు యజమానుల్లో ఒకరు నా దగ్గరకు వచ్చి ‘రాస్, మీరు డకౌట్‌గా వస్తే మిలియన్‌ డాలర్లను చెల్లించం’’ అని నా మొహం మీద చిన్నగా మూడు నాలుగుసార్లు కొట్టాడు. అప్పటికీ అతడు నవ్వుతూనే ఉన్నాడు. అవేవీ గట్టి దెబ్బలు కాదు. అయితే ఇది కావాలని నాటకమాడినట్లు పూర్తిగా అనిపించలేదు. ఇక ఆ పరిస్థితుల్లో నేనూ పెద్ద విషయం చేయదల్చుకోలేదు. అయితే క్రీడావృత్తిలో ఇలాంటి పరిస్థితిని వస్తుందని ఊహించలేదు’’ రాస్‌ టేలర్‌ వివరించాడు. అయితే ఏ సంవత్సరంలో జరిగిందనే విషయం మాత్రం తెలపలేదు. భారత టీ20 లీగ్‌లో టేలర్ 55  మ్యాచులు ఆడి 1,017 పరుగులు సాధించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని