Virat Kohli: అప్పుడు సచిన్‌.. ఇప్పుడు విరాట్‌

ప్రపంచకప్‌లో ఒక బ్యాటర్‌ గొప్పగా ఆడి పరుగుల వరద పారించినా భారత్‌కు కొద్దిలో కప్‌ దూరం కావడం ఇది రెండోసారి.

Updated : 20 Nov 2023 04:18 IST

ప్రపంచకప్‌ (Icc World Cup)లో ఒక బ్యాటర్‌ గొప్పగా ఆడి పరుగుల వరద పారించినా భారత్‌ (India)కు కొద్దిలో కప్‌ దూరం కావడం ఇది రెండోసారి. 2003 ప్రపంచకప్‌లో సచిన్‌ (sachin tendulkar) 673 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. 20 ఏళ్ల తర్వాత విరాట్‌ (Virat Kohli) కూడా 765 పరుగులతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. కానీ రెండుసార్లూ ఆస్ట్రేలియా (Australia)నే టీమ్‌ఇండియా (Team India)ను ఓడించింది. అప్పుడు సచిన్‌, ఇప్పుడు విరాట్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీ (Man Of The Tourney) ’గా నిలిచారు.

టాప్‌-5 స్కోరర్లు

కోహ్లి- 765

రోహిత్‌- 597

డికాక్‌ (దక్షిణాఫ్రికా)- 594

రచిన్‌ రవీంద్ర (న్యూజిలాండ్‌)- 578

డరైల్‌ మిచెల్‌ (న్యూజిలాండ్‌)- 552


టాప్‌- 5 వికెట్ల వీరులు

షమి- 24

ఆడమ్‌ జంపా (ఆస్ట్రేలియా)- 23

మదుశంక (శ్రీలంక)- 21

బుమ్రా- 20

కొయెట్జీ (దక్షిణాఫ్రికా)- 20


7. ప్రపంచకప్‌ చరిత్రలో రోహిత్‌ చేసిన శతకాలు. అతనే అగ్రస్థానంలో ఉన్నాడు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని