IND vs SA: కట్టుదిట్టంగా భారత బౌలింగ్‌.. 15 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోరు 59/2

సఫారీలతో జరుగుతున్న కీలకమైన రెండో వన్డేలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేస్తున్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లపై ఒత్తిడి కొనసాగిస్తున్నారు.

Updated : 09 Oct 2022 17:32 IST

రాంచీ: సఫారీలతో జరుగుతున్న కీలకమైన రెండో వన్డేలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేస్తున్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లపై ఒత్తిడి కొనసాగిస్తున్నారు. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పరుగులు చేసేందుకు బ్యాటర్లు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. 

ఓపెనర్‌ క్వింటన్ డికాక్‌ (5)ను సిరాజ్‌ బౌల్డ్‌ చేసి టీమ్‌ఇండియాకు తొలి బ్రేక్‌ అందించాడు. అయితే మరో ఓపెనర్‌ మలన్ (25) కాస్త దూకుడుగా ఆడాడు. హెండ్రిక్స్‌ (20*)తో కలిసి రెండో వికెట్‌కు 33 పరుగులు జోడించి.. ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే భారత అరంగేట్ర బౌలర్‌ షహబాజ్‌ అహ్మద్‌ అద్భుతమైన బంతికి మలన్‌ను వికెట్ల ముందు దొరకబచ్చుకున్నాడు. కానీ దక్షిణాఫ్రికా బ్యాటర్ డీఆర్ఎస్‌కు వెళ్లాడు. అయితే సమీక్షలోనూ ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది.  ప్రస్తుతం క్రీజ్‌లో హెన్రిక్స్‌తోపాటు మార్‌క్రమ్(7*) ఉన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని