Shubman Gill: ఎలాన్‌ మస్క్‌.. మీరు ఆ సంస్థను కొనేయండి: శుభ్‌మన్ గిల్‌

టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌.. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ను కొనుగోలు చేయడం ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

Published : 01 May 2022 01:56 IST

Photo Credit: Twitter

దిల్లీ: టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌.. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ను కొనుగోలు చేయడం ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఏదో రూపంలో దానిపై చర్చ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ మస్క్‌కు ఓ అభ్యర్థన పెట్టుకున్నాడు. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని కొనుగోలు చేయండంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

‘ఎలాన్‌ మస్క్‌.. దయచేసి స్విగ్గీని కొనుగోలు చేయండి. అప్పుడు వారు సమయానికి ఫుడ్ డెలివరీ చేయగలరు’ అంటూ గిల్‌ ట్విటర్‌లో పోస్టు పెట్టాడు. దీనిపై స్విగ్గీ సంస్థ వెంటనే స్పందించింది. ‘హాయ్ శుభ్‌మన్ గిల్. మేం సరిచూసుకునేందుకు ఒకసారి మీ ఆర్డర్ వివరాలు పంపండి’ అని ట్వీట్ చేసింది. ఆ తర్వాత శుభ్‌మన్ వివరాలు పంపినట్లు వెల్లడించింది. కాగా, ఈ క్రికెటర్ ట్వీట్‌పై నెట్టింట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘టీ20 క్రికెట్‌లో మీరు చేస్తోన్న బ్యాటింగ్‌ కంటే మేం ఇంకా వేగంగా ఉన్నాం’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఒక రోజు డెలివరీ బాయ్‌గా పనిచేయండి, అప్పుడు వారి కష్టాలు మీకు అర్థమవుతాయి’ అంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు. 

ప్రస్తుతం జరుగుతోన్న టీ20 టోర్నీలో శుభ్‌మన్ గిల్ గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ఆ జట్టు దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన గిల్‌.. 229 పరుగులు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు