Suryakumar Yadav: ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సూర్య దూరమేనా? ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌

Suryakumar Yadav: ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ తాజాగా ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. అతడు ఐపీఎల్‌లో ఆడకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Published : 19 Mar 2024 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరో మూడు రోజుల్లో ఐపీఎల్‌ 17 (IPL 2024)వ సీజన్‌ ప్రారంభం కానుంది. ఫ్రాంచైజీలన్నీ ట్రైనింగ్‌లో బిజీగా ఉన్నాయి. కానీ, గాయం నుంచి కోలుకుంటున్న ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) ఫిట్‌నెస్‌పై ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఈ సీజన్‌కు అతడు ఆడతాడా? లేదా అన్న సందిగ్ధత నెలకొన్న వేళ.. సూర్య పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

ఈ క్రికెటర్‌ తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో ‘ముక్కలైన హృదయం’ ఎమోజీని పోస్ట్‌ చేశాడు. దీంతో అతడు మైదానంలో అడుగుపెట్టడం మరింత ఆలస్యం కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

గత సీజన్‌ ఐపీఎల్‌ హీరోలు.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?

సూర్య గురించి ముంబయి ప్రధాన కోచ్‌ మార్క్ బౌచర్ నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మేం అతడి ఫిట్‌నెస్‌కు సంబంధించిన అప్‌డేట్ కోసం వేచి చూస్తున్నాం. బీసీసీఐ నుంచి సమాచారం రావాల్సి ఉంది. ఎలాంటి ఫిట్‌నెస్‌ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం. మా వద్ద ప్రపంచస్థాయి వైద్యబృందం అందుబాటులో ఉంది’’ అని బౌచర్‌ వెల్లడించాడు. ఆ మరుసటి రోజే సూర్య ఈ ఎమోజీ పెట్టడం చర్చనీయాంశమైంది.

గతేడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్‌ సందర్భంగా అతడు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో శస్త్రచికిత్స చేయించుకున్న సూర్య.. అప్పటినుంచి జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇటీవల తాను కోలుకుంటున్న వీడియోలను షేర్‌ చేసి.. ‘పని జరుగుతోంది.. త్వరలోనే కలుస్తా’ అని రాసుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని