T20 World Cup:బుర్జ్‌ ఖలీఫాపై మెరిసిన టీమ్‌ఇండియా న్యూ జెర్సీ

యూఏఈ, ఒమన్‌ వేదికగా అక్టోబరు 17న ప్రారంభంకానున్న టీ20 ప్రపంచక‌ప్‌లో  టీమ్‌ఇండియా ఆట‌గాళ్లు కొత్త జెర్సీల్లో క‌నిపించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన న్యూ జెర్సీలను భారత పురుషులు, మహిళల జట్ల అధికారిక కిట్‌ స్పాన్సర్‌ ఎంపీల్‌ స్పోర్ట్స్‌ ఆవిష్కరించింది. న్యూ జెర్సీ

Updated : 14 Oct 2021 17:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూఏఈ, ఒమన్‌ వేదికగా అక్టోబరు 17న ప్రారంభంకానున్న టీ20 ప్రపంచక‌ప్‌లో  టీమ్‌ఇండియా ఆట‌గాళ్లు కొత్త జెర్సీల్లో క‌నిపించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన న్యూ జెర్సీలను భారత పురుషులు, మహిళల జట్ల అధికారిక కిట్‌ స్పాన్సర్‌ ఎంపీల్‌ స్పోర్ట్స్‌ ఆవిష్కరించింది. న్యూ జెర్సీ డార్క్ బ్లూ కలర్ లో ఉంది. అభిమానులే స్ఫూర్తిగా ఈ జెర్సీని రూపొందించినట్లు బీసీసీఐ తెలిపింది. ‘అభిమానుల గుర్తుగా జెర్సీని రూపొందించడం భారత క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి. గత మేటి మ్యాచ్‌ల సందర్భంగా అభిమానులు చేసిన నినాదాలు, హర్షధ్వానాలు జెర్సీపై ఉంటాయి’ అని ఎంపీల్‌ స్పోర్ట్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. 

అయితే, టీ20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియా ఆటగాళ్లు ధరించే జెర్సీ చిత్రాలను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్‌ ఖలీఫాపై బుధవారం రాత్రి ప్రదర్శించారు. జెర్సీ విడుదలకు సంబంధించిన వీడియోను కూడా దానిపై ప్రదర్శించారు. ముఖ్యంగా బుర్జ్‌ ఖలీఫాపై కోహ్లీ, రోహిత్, జడేజాల ఫొటోలు తళుక్కున మెరిశాయి. ఇందుకు సంబందించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

ఇదిలా ఉండగా, గతేడాది ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ విజేతగా నిలిచిన అనంతరం ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చిత్రాన్ని బుర్జ్‌ ఖలీఫాపై ప్రదర్శించిన సంగతి తెలిసిందే. బుర్జ్ ఖలీఫాపై ఓ భారత క్రికెటర్ ఫొటో కనిపించడం అదే తొలిసారి. ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్ లోగో, ఆటగాళ్ల ఫొటోలను సైతం ఈ  ప్రఖ్యాత కట్టడంపై ప్రదర్శించారు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్‌ 24న టీమ్‌ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని