Tokyo Olympics: సౌరభ్‌ షూటింగ్‌ అదుర్స్‌.. ఫైనల్‌కు దూసుకెళ్లిన యువ కెరటం

భారత యువ షూటర్‌ సౌరభ్‌ చౌదరి దుమ్మురేపాడు. 10మీటర్ల పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మొత్తం 36 మంది పోటీపడగా 586-28Xతో అగ్రస్థానంలో నిలిచాడు. అతడి సహచరుడు అభిషేక్‌ వర్మ 575-19Xతో 17వ స్థానానికి పరిమితమయ్యాడు...

Published : 24 Jul 2021 11:23 IST

టోక్యో: భారత యువ షూటర్‌ సౌరభ్‌ చౌదరి దుమ్మురేపాడు. 10మీటర్ల పురుషుల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మొత్తం 36 మంది పోటీపడగా 586-28Xతో అగ్రస్థానంలో నిలిచాడు. అతడి సహచరుడు అభిషేక్‌ వర్మ 575-19Xతో 17వ స్థానానికి పరిమితమయ్యాడు. సౌరభ్ ఆరు సిరీసుల్లో వరుసగా 95, 98, 98, 100, 98, 97 పాయింట్లు సాధించడం గమనార్హం. మధ్యాహ్నం అతడు పతకం సాధిస్తాడో లేదో చూడాలి.

ఇక టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో శరత్‌ కమల్‌, మనికా బాత్రా జోడీ ఓటమి పాలైంది. మూడో సీడ్‌, చైనీస్‌ తైపీకి చెందిన లిన్‌ యున్‌ జు, చెంగ్‌ ఐ చింగ్‌ చేతిలో 11-8, 11-6, 11-5, 11-4 తేడాతో ఓడిపోయారు. ఇక వీరు వ్యక్తిగత, మహిళలు, పురుషుల విభాగాల్లో అదృష్టం పరీక్షించుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని