Kohli vsGanguly: కోహ్లీ యాటిట్యూడ్‌ ఇష్టమే కానీ.. బాగా కొట్లాడతాడు: దాదా

టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ యాటిట్యూడ్‌ (వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం) అంటే తనకు చాలా ఇష్టమని, అయితే.. అతడు బాగా కొట్లాడతాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో ఇద్దరి మధ్య భిన్న స్వరాలు వినిపించిన సంగతి తెలిసిందే.

Updated : 19 Dec 2021 09:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ యాటిట్యూడ్‌ (వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం) అంటే తనకు చాలా ఇష్టమని, అయితే.. అతడు బాగా కొట్లాడతాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో ఇద్దరి మధ్య భిన్న స్వరాలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా గురుగావ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న దాదాను విలేకర్లు పలు ప్రశ్నలు వేశారు. ఇప్పుడున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లలో ఎవరి యాటిట్యూడ్‌ అంటే మీకు ఇష్టమని ప్రశ్నించారు. దీంతో ఆయన ఇలా బదులిచ్చాడు. ‘నాకు కోహ్లీ యాటిట్యూడ్‌ అంటే చాలా ఇష్టం.. కానీ, అతడు బాగా కొట్లాడతాడు’ అని పేర్కొన్నాడు.

అనంతరం విలేకర్లు మరో ప్రశ్న వేయగా దాదా తనదైనశైలిలో స్పందించాడు. మీరు జీవితంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించగా.. జీవితంలో ఒత్తిడి ఉండదని చెప్పాడు. అయితే.. భార్య, గర్ల్‌ఫ్రెండ్‌ లాంటివారు మనల్ని ఒత్తిడిలోకి నెడతారని సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక టీమ్‌ఇండియా గురువారం దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లిన సమయంలో గంగూలీ మీడియాతో మాట్లాడాడు. తన మాటలకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడిన కోహ్లీ విషయాన్ని బీసీసీఐ చూసుకుంటుందని, దాన్ని మీడియా వదిలేయాలని కోరాడు. కాగా, కోహ్లీని ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వన్డే సారథ్యం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై వ్యతిరేకత రావడంతో ఈ విషయాన్ని అతడికి ముందే చెప్పానని గంగూలీ పేర్కొనగా.. అలాంటిదేమీ లేదని కోహ్లీ విలేకర్లకు బదులిచ్చాడు. దీంతో టీమ్‌ఇండియా క్రికెట్‌లో పెద్ద దుమారం చెలరేగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని