WTC Final: భారత్‌తో ఆడేటప్పుడు అది లెక్కలోకి రాదు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియాతో తలపడేటప్పుడు ఇటీవల ఇంగ్లాండ్‌పై సాధించిన టెస్టు సిరీస్‌ విజయం లెక్కలోకి రాదని న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌బౌల్ట్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 16 Jun 2021 01:28 IST

సౌథాంప్టన్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో టీమ్‌ఇండియాతో తలపడేటప్పుడు ఇటీవల ఇంగ్లాండ్‌పై సాధించిన టెస్టు సిరీస్‌ విజయం లెక్కలోకి రాదని న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌బౌల్ట్‌ అభిప్రాయపడ్డాడు. సౌథాంప్టన్‌ వేదికగా శుక్రవారం నుంచి భారత్‌, కివీస్‌ జట్లు ఛాంపియన్‌షిప్‌ తుదిపోరులో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌పై గెలుపొందాక కేన్‌ విలియమ్సన్‌ జట్టు మంగళవారం సౌథాంప్టన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా బౌల్ట్‌ మీడియాతో మాట్లాడుతూ ఇలా పేర్కొన్నాడు.

‘తుదిపోరులో భారత్‌తో ఆడేటప్పుడు ఇంగ్లాండ్‌పై సాధించిన సిరీస్‌ విజయం పెద్దగా లెక్కలోకి రాదని నేను అనుకుంటున్నా. మా ఆటగాళ్లు బాగా సన్నద్ధమయ్యేందుకు అది ప్రాక్టీస్ మ్యాచ్‌లా ఉపయోగపడింది. అలాగే కోహ్లీసేనతో ఫైనల్లో తలపడేందుకు నేనెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇక ఫైనల్లో మేం మంచి ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నా. మరోవైపు నేను ఐపీఎల్‌లో ఆడటం వల్ల ఈ భారత జట్టులో కొంతమంది ఆటగాళ్లు తెలిసిన వాళ్లు ఉంటారు. అయితే, నేను ఆడే ముంబయి ఇండియన్స్‌ జట్టులో ఇప్పటివరకు ఒక్కర్ని కూడా చూడలేదు. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల కారణంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తుండటం వల్ల నేను వారిని చూడలేదేమో. అయితే, ఫైనల్లో మా రెండు జట్ల ఆటగాళ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొని ఉంటుందని భావిస్తున్నా’ అని బౌల్ట్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు