అశ్విన్‌ పెద్దన్నలా సలహాలిచ్చాడు: విహారి

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా మరో ఓటమి నుంచి తప్పించుకుంది. దీంతో మూడు టెస్టులు పూర్తయ్యేసరికి భారత్‌ 1-1తో సమానంగా నిలిచింది. చివరి రోజు హనుమ...

Updated : 29 Nov 2023 11:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా మరో ఓటమి నుంచి తప్పించుకుంది. దీంతో మూడు టెస్టులు పూర్తయ్యేసరికి భారత్‌ 1-1తో సమానంగా నిలిచింది. చివరి రోజు హనుమ విహారి (23 నాటౌట్‌; 161 బంతుల్లో 4×4), అశ్విన్‌ (39 నాటౌట్‌; 128 బంతుల్లో 7×4) అసాధారణ పోరాటం చేయడంతో మ్యాచ్‌ డ్రా అయిన సంగతి తెలిసిందే. అయితే, ఆట పూర్తయ్యాక ఎలా స్పందించాలో తెలియలేదని అశ్విన్‌ పేర్కొన్నాడు. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని చెప్పాడు. 

‘ఆదివారం రాత్రి నేను నిద్రపోయే ముందు చివరిరోజు వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నా. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ డుప్లెసిస్‌ను స్ఫూర్తిగా తీసుకొని పట్టుదలగా బ్యాటింగ్‌ చేయాలని అనుకున్నా’ అని అశ్విన్‌ తెలిపాడు. ఇక విహారి మాట్లాడుతూ..‘బ్యాటింగ్‌ చేసేటప్పుడు అశ్విన్‌ పెద్దన్నలా సలహాలిచ్చాడు. ధ్యాసంతా మ్యాచ్‌పైనే పెట్టాలని, వీలైనంతసేపు క్రీజులో పాతుకుపోవాలని సూచించాడు’ అని పేర్కొన్నాడు. తామిద్దరం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఆడామని.. ఈ ఇన్నింగ్స్‌ తమ ఇద్దరికీ ఎంతో ప్రత్యేకమని వివరించాడు.

ఇవీ చదవండి..

టీమిండియాకు షాక్‌: సిడ్నీ మ్యాచ్‌ హీరో ఔట్‌!

కోహ్లీకి రోహిత్‌ కంగ్రాట్స్‌: ఫ్యాన్స్‌ హ్యాపీ

‘డ్రా’ కానే కాదిది.. ఆసీస్‌ పొగరుకు ఓటమి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని