ICC Test Team 2022: అత్యుత్తమ టెస్టు జట్టుని ప్రకటించిన ఐసీసీ.. భారత్‌ నుంచి ఒక్కరికే అవకాశం

2022 సంవత్సరానికి అత్యుత్తమ టెస్టు జట్టును ఐసీసీ ప్రకటించింది. భారత్‌ నుంచి రిషభ్‌ పంత్‌ మాత్రమే చోటు దక్కించుకున్నాడు.

Published : 24 Jan 2023 23:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2022 సంవత్సరానికి సంబంధించి పురుషుల విభాగంలో తమ అత్యుత్తమ టెస్టు జట్టును ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టులో భారత్‌ నుంచి రిషభ్‌ పంత్‌ ఒక్కడే ఎంపికయ్యాడు. గతేడాది టెస్టుల్లో అతడు రెండు శతకాలు, నాలుగు అర్ధ సెంచరీలు బాదాడు. మొత్తం 12 ఇన్నింగ్స్‌లో ఆడి 680 పరుగులు సాధించాడు. అతడి సగటు 61.81, స్ట్రెక్‌రేట్‌ 90.90గా ఉంది. టెస్టుల్లో 21 సిక్సులు బాదడంతో పాటు 23 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ అత్యుత్తమ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టు

ఉస్మాన్‌ ఖవాజా(ఆస్ట్రేలియా), బ్రాత్‌వైట్‌  ‌(వెస్టిండీస్‌), మార్నస్‌ లాబుషేన్‌(ఆస్ట్రేలియా), బాబర్‌ అజామ్‌(పాకిస్థాన్‌), జానీ బెయిర్‌ స్టో(ఇంగ్లాండ్‌), బెన్‌ స్టోక్స్‌(‌కెప్టెన్‌), రిషభ్‌పంత్‌( భారత్‌), పాట్‌ కమిన్స్‌(ఆస్ట్రేలియా), కగిసో రబాడ(దక్షిణాఫ్రికా), నాథన్‌ లియోన్‌(ఆస్ట్రేలియా), జేమ్స్‌ అండర్సన్‌ (ఇంగ్లాండ్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని