Virat Kohli: కుమార్తె వామికతో విరాట్‌ ఫొటో వైరల్‌

Virat Kohli: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ తన కుమార్తె వామికతో కలిసి లండన్‌లోని ఓ రెస్టారంట్‌కు వెళ్లాడు. ఆ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

Published : 27 Feb 2024 10:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli), ప్రముఖ నటి అనుష్క శర్మ (Anushka Sharma) దంపతులు మరోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు లండన్‌లో ఉన్నారు. తాజాగా కోహ్లీ తన కుమార్తె వామిక (Vamika)ను తీసుకుని లండన్‌లోని ఓ రెస్టారంట్‌కు వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఇందులో ఓ టేబుల్‌ వద్ద వామిక భోజనం చేస్తుండగా పక్కన కోహ్లీ కూర్చుని కన్పించాడు. అయితే, తమ పిల్లల విషయంలో గోప్యత పాటించాలనుకుంటున్నట్లు అతడు గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. తన కుమార్తె ఫొటోలు తీయొద్దని ఆ మధ్య మీడియాను కూడా కోరాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తూ.. తాజాగా వైరల్‌ అయిన ఫొటోలో కొందరు అభిమానులు వామిక ముఖంపై ఎమోజీని ఉంచి పోస్ట్‌ చేశారు.

కోహ్లీ అండ్‌ కో వస్తే.. ఏం చేయాలో మాకు తెలుసు: రోహిత్ శర్మ

ఫిబ్రవరి 15న లండన్‌లోని ఓ ఆసుపత్రిలో అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాడు. తమ బాబుకు ‘అకాయ్‌ (Akaay)’గా నామకరణం చేసినట్లు తెలిపాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌ సిరీస్‌ మొత్తానికి దూరమైన విరాట్‌.. త్వరలో జరగబోయే ఐపీఎల్‌ ఆడతాడా? లేదా? అన్నదానిపైనా సందిగ్ధత నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని