IND vs ENG : విరాట్ ఔట్‌పై అతిగా కంగారు పడాల్సిన అవసరం లేదు: ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు

ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో మరోసారి విఫలమైన టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ (11) ఫామ్‌పై అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది. అయితే..

Published : 03 Jul 2022 01:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో మరోసారి విఫలమైన టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ (11) ఫామ్‌పై అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది. అయితే ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు గ్రేమ్‌ స్వాన్‌ మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. ‘‘తక్కువ పరుగులకే ఔటైన విరాట్ కోహ్లీ అతిగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు’’ అని స్వాన్‌ వ్యాఖ్యానించాడు. సెకండ్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ 19 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేశాడు. ఇందులో రెండు బౌండరీలు ఉన్నాయి. క్రీజ్‌లో కుదురుకునే సమయంలో ఇంగ్లాండ్‌ యువ బౌలర్‌ మ్యాథ్యూ పాట్స్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. బ్యాట్‌కు బంతి ఎడ్జ్‌ తీసుకుని వికెట్లను పడగొట్టడంతో కోహ్లీ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. 

లీసెస్టర్‌తో వార్మప్‌ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అర్ధశతకం సాధించి ఆకట్టుకున్నాడు. ఫామ్‌ కొనసాగిస్తూ పరుగులు రాబడతాడని ఆశించిన అభిమానులకు నిరాశ మిగిలింది. విరాట్ కోహ్లీ దురదృష్టవశాత్తూ ఔటయ్యాడని, ఫామ్‌పై కంగారు పడాల్సిన అవసరం లేదని గ్రేమ్‌ స్వామ్‌ పేర్కొన్నాడు. ‘‘కోహ్లీ ఔటైన బంతిని చూశా. ఎక్కువగా ఇన్‌స్వింగ్‌ కావడంతో దురదృష్టవశాత్తూ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. ఆ బాల్‌ మినహా మిగతా బాగానే ఆడాడు. క్రీజ్‌లో చాలా కంఫర్ట్‌గా కనిపించాడు. అందుకే కోహ్లీ తన ఫామ్‌పై ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పరుగుల దాహంతో ఉన్నాడు. తప్పకుండా రన్స్‌ చేస్తాడు. ఇక రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. అయితే ఇదేమీ నాకు ఆశ్చర్యమనిపించలేదు’’ అని గ్రేమ్‌ స్వాన్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని