Washington Sundar: అప్పుడు నా ఖాతా హ్యాక్‌ అయింది.. ఆ ట్వీట్లు నావి కావు: వాషింగ్టన్ సుందర్

ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌ బాధితుల్లో టీమ్‌ఇండియా క్రికెటర్ వాషింగ్టన్‌ సుందర్‌ కూడా చేరిపోయాడు. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన దుండుగులు పెట్టిన పోస్టులకు తనకు సంబంధం లేదని సుందర్‌ ప్రకటన జారీ చేశాడు.

Published : 11 Jun 2023 14:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రిప్టో కరెన్సీకి సంబంధించి తన ట్విటర్‌ ఖాతా నుంచి వచ్చిన ట్వీట్లు తాను చేసినవి కాదని టీమ్ఇండియా క్రికెటర్‌ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) తెలిపాడు. తన ఖాతా హ్యాకింగ్‌కు గురైందని.. ఆ సమయంలో వచ్చిన ట్వీట్లకు తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ ట్వీట్లను నమ్మొద్దని, ఇలా జరిగినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు శనివారం రాత్రి సుందర్‌ ట్వీట్‌ చేశాడు. గత వారం సుందర్‌ ట్విటర్‌ ఖాతాను హ్యాక్‌ చేసిన దుండగులు ‘క్రిప్టో కరెన్సీ’కి సంబంధించి పోస్టులు పెట్టారు. 

‘‘అభిమానులకు ఒక విన్నపం.. గత వారంలో వచ్చిన కొన్ని ట్వీట్లను నేను చేయలేదు. అలాంటి కంటెంట్‌తో నాకు సంబంధం లేదు. నా ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురి కావడంతో దుండగులు కొన్ని పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఆ సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు నా ఖాతా సెక్యూరిటీ కోసం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. ఈ క్రమంలో ఇబ్బంది కలిగించినందుకు అందరికీ క్షమాపణలు చెబుతున్నా. అర్థం చేసుకుని మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు’’ అని ట్వీట్‌ చేశాడు. 

గతంలోనూ క్రికెటర్లు, ఐపీఎల్‌ ఫ్రాంఛైజీకి సంబంధించిన ట్విటర్‌ ఖాతాలు హ్యాకింగ్‌కు గురైన సంఘటనలూ ఉన్నాయి. ఐపీఎల్ 2023 సీజన్‌ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు ట్విటర్ ఖాతాను దుండుగులు రెండుసార్లు హ్యాక్‌ చేశారు. అలాగే లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు తాత్కాలిక కెప్టెన్‌ కృనాల్ పాండ్య ఖాతానూ హ్యాకింగ్‌కు గురైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని