PV Sindhu: రీమిక్స్‌ పాటకు పీవీ సింధు స్టెప్పులు.. వీడియో వైరల్‌

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు తన ఆటతోనే కాకుండా అప్పుడప్పుడూ అభిమానులను తన డ్యాన్స్‌తోనూ అలరిస్తూ ఉంటుంది...

Published : 04 Jul 2022 01:43 IST

(Photo: PV Sindhu Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు తన ఆటతోనే కాకుండా అప్పుడప్పుడూ అభిమానులను తన డ్యాన్స్‌తోనూ అలరిస్తూ ఉంటుంది. ఇదివరకు ‘కచ్చా బాదాం, మాయాకిర్రియే’ పాటలకు స్టెప్పులేసిన ఆమె తాజాగా మరో రీమిక్స్‌ పాటకు పాదాలు కదిపింది. ఓ పెద్ద భవంతి ముందు నిల్చొని ఈ డ్యాన్స్‌ చేసినట్లు ఉంది. ఆ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో ఇప్పుడది వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దీనికి 2,25680 మంది లైకులు కొట్టారు. ఆ పోస్టుకు ‘మీకు ఏదైతే నిజమైన ఆనందం కలిగిస్తుందో దాన్ని కచ్చితంగా చేయండి’ అని వ్యాఖ్యానించింది. మరోవైపు సింధు ఆట విషయానికి వస్తే ప్రస్తుతం జరుగుతోన్న మలేసియా ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓడింది. చైనీస్‌ తైపీకి చెందిన తాయ్‌ జు యింగ్‌ చేతిలో శుక్రవారం హోరాహోరీగా తలపడిన మ్యాచ్‌లో చివరి క్షణాల్లో ఒత్తిడికి గురై ఓటమిపాలైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు