Viral Video: అతడి బౌలింగ్‌.. లగాన్‌ సినిమా సన్నివేశాన్ని తలపించింది..!

అమీర్‌ఖాన్‌ నటించిన ‘లగాన్‌’ చిత్రంలోని గోలీ అనే పాత్రధారి బౌలింగ్‌ యాక్షన్‌ గుర్తుందా? ఇంగ్లిష్‌ క్రికెటర్లు బ్యాటింగ్‌ చేస్తుండగా.. అమీర్‌ఖాన్‌ గోలీ అనే వ్యక్తికి బౌలింగ్‌ చేయమని బంతిని అప్పగిస్తాడు...

Updated : 29 Jun 2023 18:33 IST

(Photo: Viral Video Screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆమిర్‌ఖాన్‌ నటించిన ‘లగాన్‌’ చిత్రంలోని గోలీ అనే పాత్రధారి బౌలింగ్‌ యాక్షన్‌ గుర్తుందా? ఇంగ్లిష్‌ క్రికెటర్లు బ్యాటింగ్‌ చేస్తుండగా.. గోలీ అనే వ్యక్తికి బౌలింగ్‌ చేయమని ఆమిర్‌ఖాన్‌ బంతిని అప్పగిస్తాడు. దీంతో అతడు బంతి అందుకొని ఒక చేతిని గిర్రున తిప్పుతూ వచ్చి బ్యాట్స్‌మన్‌కేసి నేరుగా బంతిని విసురుతాడు. అప్పుడు క్రీజులో బ్యాటింగ్‌ చేసే ఆటగాడికి ఆ బంతి ఎక్కడ పడుతుందో అర్థంకాక సరిగ్గా ఆడలేకపోతాడు. ఇప్పుడు అచ్చం అలాంటి సన్నివేశమే చోటుచేసుకుంది.

ఒక యువకుడు బంతిని పట్టుకొని తన చేతిని గిరాగిరా తిప్పుతూ వెళ్లి బౌలింగ్‌ చేశాడు. ఆ బ్యాటర్‌ ఎలా ఆడాలో అర్థంకాక విఫలమయ్యాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు లగాన్‌ సినిమాలోని సిన్నివేశాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే, ఈ ఆట ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, చివరికి మైఖేల్‌ వాన్‌ సైతం ఆ వీడియోను చూసి ఫిదా అయ్యాడు. దానికి సరైన యాక్షన్‌ అంటూ కామెంట్ చేసి రీట్వీట్‌ చేశాడు. మీరూ ఆ వీడియో చూసి ఆస్వాదించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని