IND vs SA: నిర్ణయాత్మకమైన ఐదో టీ20కి వర్షం అంతరాయం?

భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన ఐదో టీ20కి వర్షం అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. మ్యాచ్‌ జరిగే సమయంలో చిన్నస్వామి స్టేడియం...

Updated : 19 Jun 2022 15:09 IST

బెంగళూరు: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన ఐదో టీ20కి వర్షం అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. మ్యాచ్‌ జరిగే సమయంలో చిన్నస్వామి స్టేడియం ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇప్పటికే గత వారం రోజులుగా బెంగళూరులో కురుస్తోన్న వర్షం కారణంగా రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌-బెంగాల్‌, ముంబయి-ఉత్తర్‌ ప్రదేశ్‌ మ్యాచ్‌లకు కూడా ఇబ్బంది కలిగింది. ఇక ఇప్పటికే ఈ సిరీస్‌ 2-2తో సమానంగా మారింది. దక్షిణాఫ్రికా జట్టు తొలి రెండు మ్యాచ్‌లు గెలుపొందగా టీమ్‌ఇండియా గత రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దీంతో నిర్ణయాత్మకమైన ఐదో టీ20పై ఆసక్తి పెరిగింది. మరి ఈ మ్యాచ్‌ సజావుగా సాగుతుందో లేదో చూడాలి.

పిచ్‌ ఎలా ఉంది?

చిన్నస్వామి స్టేడియం పిచ్‌ బ్యాట్స్‌మెన్‌, బౌలర్లకు సమానంగా సహకరిస్తుంది. ఇక్కడి పిచ్‌, చిన్న బౌండరీలు బ్యాట్స్‌మెన్‌కు కలిసొచ్చేవే. అయితే ఈ మైదానంలో మరీ భారీ స్కోర్లు నమోదు కావు. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 155. స్పిన్నర్లకు పిచ్‌ బాగా అనుకూలిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు