WT20 WC 2023: మహిళల టీ20 ప్రపంచకప్.. టీమ్‌ఇండియా షెడ్యూల్‌ ఇదే

2023 మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభంకానుంది. 

Published : 04 Feb 2023 23:54 IST

ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి 10 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌నకు సర్వం సిద్ధమైంది. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌.. గ్రూప్‌-బిలో ఇంగ్లాండ్‌, భారత్‌, పాకిస్థాన్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌ ఉన్నాయి. రెండు గ్రూప్‌ల్లో టాప్‌ 2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. ఒక్కో జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. కేప్ టౌన్, గ్కెబెర్హా, పార్ల్ వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. 

భారత జట్టు: 

హర్మన్‌ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, రిచా ఘోష్, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, అంజలి సర్వాణి, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే.   

పూర్తి షెడ్యూల్‌ ఇదే.. 

  • ఫిబ్రవరి 10న సౌతాఫ్రికా వర్సెస్‌ శ్రీలంక- రాత్రి 10.30 (కేప్‌టౌన్‌)
  • ఫిబ్రవరి 11న వెస్టిండీస్‌ వర్సెస్ ఇంగ్లాండ్‌- సాయంత్రం 6.30 (పార్ల్‌) 
  • ఫిబ్రవరి 11న ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్- రాత్రి 10.30 (పార్ల్)
  • ఫిబ్రవరి 12న భారత్‌ వర్సెస్‌ పాకిస్థాన్‌- సాయంత్రం 6.30 (కేప్‌టౌన్‌)
  • ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక రాత్రి- 10.30 (కేప్‌టౌన్‌)
  • ఫిబ్రవరి 13న ఐర్లాండ్‌ వర్సెస్‌ ఇంగ్లాండ్- సాయంత్రం 6.30- (పార్ల్)  
  • ఫిబ్రవరి 13న సౌతాఫ్రికా వర్సెస్‌ న్యూజిలాండ్- రాత్రి 10.30 (పార్ల్)   
  • ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియా వర్సెస్‌ బంగ్లాదేశ్- రాత్రి 10.30 -(గ్కెబెర్హా) 
  • ఫిబ్రవరి 15న వెస్టిండీస్‌ వర్సెస్‌ భారత్- సాయంత్రం 6.30- (కేప్‌టౌన్‌)
  • ఫిబ్రవరి 15న పాకిస్థాన్ వర్సెస్ ఐర్లాండ్- రాత్రి 10.30- (కేప్‌టౌన్)  
  • ఫిబ్రవరి 16న శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా- సాయంత్రం 6.30- (గ్కెబెర్హా) 
  • ఫిబ్రవరి 17న న్యూజిలాండ్‌ వర్సెస్ బంగ్లాదేశ్‌- సాయంత్రం 6.30-(కేప్‌టౌన్)  
  • ఫిబ్రవరి 17న వెస్టిండీస్‌ వర్సెస్ ఐర్లాండ్- రాత్రి 10.30  (కేప్‌టౌన్)  
  • ఫిబ్రవరి 18న ఇంగ్లాండ్‌ వర్సెస్‌ భారత్- సాయంత్రం 6.30 (గ్కెబెర్హా) 
  • ఫిబ్రవరి 18న సౌతాఫ్రికా వర్సెస్‌ ఆస్ట్రేలియా- రాత్రి 10.30  (గ్కెబెర్హా) 
  • ఫిబ్రవరి 19న పాకిస్థాన్‌ వర్సెస్ వెస్టిండీస్‌- సాయంత్రం 6.30 (పార్ల్)
  • ఫిబ్రవరి 19న న్యూజిలాండ్ వర్సెస్‌ శ్రీలంక- రాత్రి 10.30 (పార్ల్)
  • ఫిబ్రవరి 20న ఐర్లాండ్ వర్సెస్ భారత్- సాయంత్రం 6.30 (గ్కెబెర్హా) 
  • ఫిబ్రవరి 21న ఇంగ్లాండ్‌ వర్సెస్‌ పాకిస్థాన్‌- సాయంత్రం 6.30 (కేప్‌టౌన్‌)
  • ఫిబ్రవరి 21న దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్‌- రాత్రి 10.30 (కేప్‌టౌన్‌)
  • ఫిబ్రవరి 23న సెమీ ఫైనల్ 1 -సాయంత్రం 6.30 (కేప్‌టౌన్‌)
  • ఫిబ్రవరి 24న సెమీ ఫైనల్ 2- సాయంత్రం 6.30 (కేప్‌టౌన్‌)
  • ఫిబ్రవరి 26న ఫైనల్ సాయంత్రం -6.30 (కేప్‌టౌన్‌)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని