CWC Qualifiers: నేపాల్‌పై వెస్టిండీస్‌ ఘన విజయం..

వన్డే ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌-ఏలో నేపాల్‌పై 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Published : 22 Jun 2023 21:16 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌-ఏలో నేపాల్‌పై 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షైయ్‌ హోప్‌ (132; 129 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (115; 94 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో విరుచుకుపడటంతో విండీస్‌ 7 వికెట్ల నష్టానికి 339 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ భారీ లక్ష్యఛేదనలో నేపాల్ 238 పరుగులకే ఆలౌటైంది. ఆరిఫ్ షేక్ (63), గుల్సన్ ఝా (42) మాత్రమే రాణించారు. వెస్టిండీస్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్ 3, అల్జారీ జోసెఫ్‌, కీమో పాల్, హోస్సెన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

గ్రూప్‌-ఏలోనే యూఏఈతో జరిగిన మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. షాయన్ జహంగీర్ (71; 86 బంతుల్లో) రాణించగా.. బౌలింగ్‌ ఆల్‌రౌండర్ జెస్సీ సింగ్ (38) ఫర్వాలేదనిపించాడు. గజానంద్ సింగ్ (33) పరుగులు చేశాడు. 212 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని నెదర్లాండ్స్‌ 43.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్కాట్ ఎడ్వర్డ్స్ (67; 60 బంతుల్లో), విజయవాడకు చెందిన తేజ నిడమనూరు (58; 68 బంతుల్లో) రాణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని