WTC Final:ఆ జట్టుకే కాస్త ఎక్కువ అవకాశం

సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ జరగనుంది.

Published : 14 May 2021 18:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ జరగనుంది. సౌథాంప్టన్‌లో ఉన్న పరిస్థితుల బట్టి చూస్తే ఈ పోరులో న్యూజిలాండ్‌ విజయం సాధించే అవకాశం కాస్త ఎక్కువగా ఉందని భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌లోని వాతావరణ పరిస్థితులు, సీమింగ్ పిచ్‌లకు కివీస్ బౌలర్లు సరిపోతారని మంజ్రేకర్‌ పేర్కొన్నాడు.

‘సౌథాంప్టన్‌లోని వాతావరణ పరిస్థితులు, పిచ్‌లను దృష్టిలో ఉంచుకుని చెప్పాలంటే న్యూజిలాండ్ జట్టు వైపే కాస్త మొగ్గుంది. భారత ఆటగాళ్ల కంటే న్యూజిలాండ్‌ ఆటగాళ్లు ఇక్కడ ఎక్కువ రాణించే అవకాశముంది. ముఖ్యంగా బౌలర్లు సహజంగానే అలాంటి పరిస్థితులకు ఉపయోగించుకుంటారు. టీమిండియా బౌలింగ్ బలంగానే ఉంది. కానీ కివీస్‌ బౌలర్లు అదనపు బౌన్స్‌ రాబట్టడం, స్వింగ్ చేయడంలో సమర్థులు. ఒకవేళ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిష్‌ భారత్‌లో నిర్వహిస్తే, టీమిండియా మూడు రోజుల్లో మ్యాచ్‌ను గెలిచి న్యూజిలాండ్‌ను ఇంటికి పంపేది. కానీ ఈ  ఫైనల్ మ్యాచ్‌ ఇంగ్లాండ్‌లో జరగనుంది. అది కూడా వేసవి కాలం ప్రథమార్ధంలో. భారత్ డబ్ల్యూటీసీ కప్‌ని గెలవడానికి న్యూజిలాండ్‌ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటుంది’ అని మంజ్రేకర్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని