MS Dhoni: ధోనీ చాలా సరదా మనిషి.. ఆయన హాస్యం అద్భుతం: ఉత్కర్ష పవార్

సీఎస్కే ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్ ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఉత్కర్ష పవార్‌ అనే అమ్మాయి వివాహమాడాడు. ఈ జంట ఐపీఎల్‌ ఫైనల్ సందర్భంగా ధోనీ (MS Dhoni)ని కలిసింది. ధోనీని కలిసినప్పుడు కలిగిన అనుభూతి గురించి ఉత్కర్ష తాజాగా వెల్లడించింది.

Published : 08 Aug 2023 01:51 IST

ఇంటర్నెట్ డెస్క్: రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లలో చెన్నై సూపర్‌ కింగ్స్ (CSK) తరఫున అదరగొట్టి టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సీఎస్కే ఛాంపియన్‌గా నిలవడంలో అతడు కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌ ఫైనల్ ముగిసిన తర్వాత రుతురాజ్‌ గైక్వాడ్.. ఉత్కర్ష పవార్‌ (Utkarsha Pawar)ను వివాహమాడాడు. ఐపీఎల్ ఫైనల్‌ సందర్భంగా ఈ జోడీ చెన్నై సూపర్‌ కింగ్స్ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni)ని కలిసింది.

సీఎస్కే క్యాంప్‌లో ధోనీని కలిసినప్పుడు కలిగిన అనుభూతి గురించి ఉత్కర్ష పవార్‌ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడుతూ వెల్లడించింది. ‘‘ధోనీ ఉన్న చోట ప్రత్యేక వాతావరణం ఉంటుంది. మీరు ఆయనను భయ్యా (అన్న) లేదా మరో విధంగా పిలవలేరు. గౌరవంతో సార్ అని పిలుస్తుంటారు. కానీ, ఆయన సింపుల్‌గా, వినయంగా ఉంటారు. ఇది నమ్మశక్యం కాని విషయం. ధోనీ చాలా సరదాగా ఉంటారు. అతని హాస్యం అద్భుతంగా ఉంటుంది. తన చుట్టూ స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేలా చూస్తాడు. ఐపీఎల్ ఫైనల్‌ తర్వాత నాకు ధోనీని కలిసే అవకాశం లభించింది. ఆయన ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యుడిలా చూసుకుంటారు. నేను కూడా ఆయన్ను ఓ కుటుంబ సభ్యుడిగా భావించా’’ అని ఉత్కర్ష పవార్‌ పేర్కొంది.

83 ఏళ్ల వయసులో ఆక్సిజన్‌ సిలిండర్‌తో వికెట్ కీపింగ్‌

24 ఏళ్ల ఉత్కర్ష పవార్‌ కూడా క్రికెటరే. మహారాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్‌ ఆడింది. రుతురాజ్‌ మాదిరిగా కేవలం బ్యాటింగ్‌ మాత్రమే కాకుండా బౌలింగ్‌ కూడా చేయగల ఆల్‌రౌండర్‌. అయితే, గత కొన్ని నెలల నుంచి ఆమె క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం పుణెలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషియన్‌, ఫిట్‌నెస్‌ సైన్స్‌ (INFS)లో చదువుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని