డాన్స్‌తో అదరగొట్టిన యూజీ సతీమణి

టీమ్‌ఇండియా మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా హల్‌చల్‌ చేస్తుంటాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ సహా ఏ ఆటగాడు సోషల్‌ మీడియాలో సంగతులు పంచుకున్నా వెంటనే ట్రోల్‌ చేస్తుంటాడు. అల్లరి చేష్టలతో కవ్విస్తుంటాడు.....

Published : 21 Jan 2021 02:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా హల్‌చల్‌ చేస్తుంటాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ సహా ఏ ఆటగాడు సోషల్‌ మీడియాలో సంగతులు పంచుకున్నా వెంటనే ట్రోల్‌ చేస్తుంటాడు. అల్లరి చేష్టలతో కవ్విస్తుంటాడు. మ్యాచులు ఏవైనా ముగియగానే చాహల్‌ టీవీ అంటూ క్రికెటర్లను యూజీ ఇంటర్వ్యూ చేసే సంగతి తెలిసిందే.

యూజీ సతీమణి ధనశ్రీ వర్మ సైతం యూట్యూబర్‌గా వెరీ ఫేమస్‌! డ్యాన్సర్‌గా ఆమెకు మంచి పేరుంది. ఆమె యూట్యూబ్‌ ఛానల్‌కు లక్షల్లో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక సోషల్‌ మీడియాలోనూ ఆమె ఎంతో చురుకుగా ఉంటుంది. అభిషేక్‌ బచ్చన్‌ నటించిన బ్లఫ్‌మాస్టర్‌ చిత్రంలోని బురోబురో పాటకు ధనశ్రీ డ్యాన్స్‌ చేసింది. అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టింది. ఆ వీడియోను ఇన్‌స్టాలో పంచుకోగా వేలల్లో లైకులు లభిస్తున్నాయి. దాంతో ఇది వైరల్‌గా మారింది. డిసెంబర్లో పెళ్లిచేసుకున్న యూజీ, ధనశ్రీ దుబాయ్‌లో హనీమూన్‌కు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి తిరిగొచ్చాక ఎంఎస్‌ ధోనీ, సాక్షి దంపతుల ఇంటికి అతిథులుగా వెళ్లి సందడి చేశారు.

ఇవీ చదవండి
ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!

 




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని