CWC Qualifiers 2023: యూఎస్‌ఏ భయపెట్టినా విండీస్‌దే విజయం.. నేపాల్‌పై జింబాబ్వే సూపర్‌ విక్టరీ

వన్డే ప్రపంచ కప్‌-2023 క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లు మొదలయ్యాయి. గ్రూప్‌-ఏలో నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో పసికూన యూఎస్ఏపై విండీస్‌ 39 పరుగుల తేడాతో గెలుపొందింది.

Published : 18 Jun 2023 22:04 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్‌-2023 క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లు (CWC Qualifiers)  మొదలయ్యాయి. గ్రూప్‌-ఏలో నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్.. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. కుశాల్ భుర్టెల్ (99; 95 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకోగా.. ఆసిఫ్ షేక్ (66), కుశాల్ మల్లా (41) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. క్రెయిగ్ ఎర్విన్‌ (121; 128 బంతుల్లో), సీన్ విలియమ్స్ (102; 70 బంతుల్లో) శతకాలు బాదడంతో 291 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే.. 44.1 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది.  

గ్రూప్‌-ఏలో జరిగిన రెండో మ్యాచ్‌లో పసికూన యూఎస్ఏపై స్టార్‌ ఆటగాళ్లున్న విండీస్‌ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు విజయం అంత సులువుగా దక్కలేదు. పెద్ద ఆటగాళ్లు లేకున్నా గట్టిగా పోరాడి విండీస్‌కు వణుకు పుట్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌.. జాన్సన్ చార్లెస్ (66), షైయ్ హోప్‌ (54), నికోలస్‌ పూరన్ (43), రోస్టన్‌ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56) తలో చేయివేయడంతో 49.3 ఓవర్లలో 297 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన యూఎస్ఏ.. 7వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గజానంద్ సింగ్ (101*; 109 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతక్కొట్టినా జట్టును గెలిపించలేకపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని