Apple Watch in iPhone: ఐఫోన్‌లోనే యాపిల్‌ వాచ్‌!

ఇకపై ఐఫోన్‌ హోం స్క్రీన్‌ మీదా యాపిల్‌ వాచ్‌ను చూసుకోవచ్చు. ఇందుకోసం యాపిల్‌ వాచ్‌ మిర్రరింగ్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఐఓఎస్‌ అప్‌డేట్‌లో ఇదో గొప్ప సదుపాయమని భావిస్తున్నారు.

Updated : 12 Oct 2022 13:04 IST

కపై ఐఫోన్‌ హోం స్క్రీన్‌ మీదా యాపిల్‌ వాచ్‌ను చూసుకోవచ్చు. ఇందుకోసం యాపిల్‌ వాచ్‌ మిర్రరింగ్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఐఓఎస్‌ అప్‌డేట్‌లో ఇదో గొప్ప సదుపాయమని భావిస్తున్నారు. ఎయిర్‌ప్లే ద్వారా ఐఫోన్‌ తెర మీద వాచ్‌ డిస్‌ప్లే అవుతుంది. టచ్‌ స్క్రీన్‌ కావటం వల్ల ఐఫోన్‌ నుంచే వాచ్‌ తెరను పూర్తిస్థాయిలో వాడుకోవచ్చు. సైడ్‌ బటన్‌, డిజిటల్‌ క్రౌన్‌ సదుపాయాలనూ ఉపయోగించుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. యాపిల్‌ వాచ్‌తో చేసే అన్ని పనులను ఐఫోన్‌ మీదే చేసుకోవచ్చు. యాపిల్‌ వాచ్‌ డిస్‌ప్లే చిన్నగా ఉండటం వల్ల మిర్రరింగ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో వాచ్‌ స్క్రీన్‌ ఫోన్‌లో మరింత పెద్దగా కనిపిస్తుంది. వాడుకోవటానికి సౌకర్యంగా ఉంటుంది. దీన్ని ఎలా ఎనేబుల్‌ చేసుకోవాలో చూద్దాం.

* ఐఫోన్‌లో సెటింగ్స్‌ను ఓపెన్‌ చేసి, యాక్సెసబిలిటీ విభాగంలోకి వెళ్లాలి.

* కిందికి స్క్రోల్‌ చేసి, యాపిల్‌ వాచ్‌ మిర్రరింగ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* యాపిల్‌ వాచ్‌ మిర్రరింగ్‌ బటన్‌ను ఆన్‌ చేసుకోవాలి. రెండు పరికరాలు కనెక్ట్‌ అయ్యేంతవరకు వేచి చూడాలి.

* వాచ్‌ డిస్‌ప్లే కనిపించాక అవసరమైనట్టు వాడుకోవటమే. ఉదాహరణకు- సైడ్‌ బటన్‌ను తాకితే యాప్‌ ట్రే తెరచుకుంటుంది. యాప్‌ లైబ్రరీలోకి వెళ్లాలంటే డిజిటల్‌ క్రౌన్‌ను ట్యాప్‌ చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని