వినూత్నం మృదు రోబో

ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్‌ కరోలీనా స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్‌ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు.

Published : 10 Jan 2024 00:32 IST

ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్‌ కరోలీనా స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్‌ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు. ఇవి ఒకే సమయంలో గిరికీలు కొడతాయి, చుట్టూ తిరుగుతాయి, వృత్తాకారంలో కదులుతాయి. అదీ మనుషులు, కంప్యూటర్‌ కంట్రోల్‌ లేకుండానే. మనుషులు వెళ్లలేని చోట్ల వివరాలు తెలుసుకోవటానికి, వాటి పటాలు రూపొందించటానికివి తోడ్పడగలవని పరిశోధకులు భావిస్తున్నారు. రిబ్బను మాదిరి ద్రవ క్రిస్టల్‌ ఎలాస్టోమెర్స్‌తో ఈ రింగ్‌బాట్స్‌ను రూపొందించారు. ఇవి నూడుల్‌ మాదిరిగా కనిపిస్తాయి. అందువల్ల చివర్లు కలిసినప్పుడు ప్రత్యేకంగా ప్రవర్తిస్తాయి. కనీసం 55 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత గల ఉపరితలాల మీద వేస్తే గిరికీలు కొడతాయి. వేడి ఉపరితలానికి తగిలిన భాగం ముడుచుకొని ముందుకు కదిలేలా చేస్తుంది. ఎంత వేడి ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా కదులుతుంది. ఇది మధ్య భాగంలోనూ చుట్లు తిరగటం వల్ల ఎటంటే అటు తిరుగుతుంది కూడా. ఏదైనా అడ్డంకి ఎదురైతే దాని హద్దుకు రింగ్‌బాట్‌ అతుక్కుంటుంది. కాబట్టి అక్కడి పరిస్థితులను పసిగడుతుంది. ఈ రింగ్‌బాట్ల ప్రవర్తన భౌతిక విషయగ్రహణ మీద ఆధారపడి ఉంటుంది. రిబ్బను వెడల్పు, ట్విస్ట్‌ అయిన చోట్ల సంఖ్య వంటి వాటి ఆధారంగా శాస్త్రవేత్తలు దీన్ని సాధించారు. ఇలా వేగం, దిశ వంటి గుణాలను ఆపాదించారు. అందువల్ల విపత్కర వాతావరణాలు గల చోట్ల పటాలను రూపొందించటానికి వాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని