ఫొటో అసలుదేనా?

ఆన్‌లైన్‌లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా.

Published : 17 Jan 2024 00:05 IST

ఆన్‌లైన్‌లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. మరి ఏది అసలు ఫొటోనో, ఏది నకిలీనో గుర్తించటమెలా? గూగుల్‌లో ‘అబౌట్‌ దిస్‌ ఇమేజ్‌’ ఫీచర్‌ను వాడుకుంటే సరి. గూగుల్‌ ఇమేజెస్‌లో ఫొటోను సెర్చ్‌ చేసినప్పుడు ఫొటో పైభాగాన కనిపించే మూడు నిలువు చుక్కల మీద క్లిక్‌ చేసి చూడండి. ఇందులో అబౌట్‌ దిస్‌ ఇమేజ్‌ మీద క్లిక్‌ చేస్తే ఆ ఫొటోతో పాటు అది గూగుల్‌లో తొలిసారి ఎప్పుడు ప్రత్యక్షమయ్యిందో కూడా తెలుస్తుంది. వార్తలు, సామాజిక మాధ్యమాలు, ఫ్యాక్‌ చెకింగ్‌ వంటి వాటి కోసం ఆ ఫొటోను ఎక్కడెక్కడ, ఎవరెవరు వాడుకున్నారో కూడా బయటపడుతుంది. ఆయా ఫొటోల విశ్వసనీయతను తెలుసుకోవచ్చు.

  • ఏదైనా ఫొటోను ఏఐ సృష్టించిందనే అనుమానం వస్తే ‘రివర్స్‌ సెర్చ్‌’ చేసీ పరిశీలించొచ్చు. గూగుల్‌ ఇమేజెస్‌ సెర్చ్‌ బాక్సులో ఆ ఫొటోను అప్‌లోడ్‌ చేసి వెతికితే నిజమేంటో తెలుస్తుంది. దాని మాదిరి ఫొటోలు కూడా కనిపిస్తాయి.
  •  ఏఐ సృష్టించిన చిత్రాలను వీలైనంత పెద్దగా చేసి పరిశీలిస్తే పిక్సెల్స్‌ గజిబిజిగా కనిపిస్తాయి. అలాగే అవుట్‌లైన్లు, ఆకారాలు విచిత్రంగా దర్శనమిస్తాయి.
  • ముఖం మీద గుంతల వంటి లోపాలను ఏఐ బాగా సరిచేస్తుంది. కాబట్టి ఫొటోషాప్‌లో తీర్చిదిద్దినట్టుగా ఫొటో మరీ స్పష్టంగా ఉన్నట్టయితే ఏఐ సృష్టించిందని అనుమానించొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని